Breaking News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఢిల్లీ పెద్దల ఒత్తిడితో వల్లే రేవంత్‌ రాజీ: ఎంపీ లక్ష్మణ్‌

Published on Wed, 05/29/2024 - 12:20

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ఇది సామాన్య నేరం కాదు.. దేశద్రోహం లాంటిది అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో సూత్రధారిపై చర్యలు తీసుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఎంపీ లక్ష్మణ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరంలో అవినీతిని వెలికితీస్తామన్న సీఎం రేవంత్‌ ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారిపై చర్యలు తీసుకోవడంలో సీఎం రేవంత్‌ వెనకడుగు వేస్తున్నారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడితోనే రేవంత్‌ ఈ కేసులో రాజీ పడ్డారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్‌లో బాధితుడు అయినప్పటికీ రేవంత్ ఏం చేయలేని స్థితిలో ఉన్నారు.

కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని ఈ వ్యవహారంతో తేలిపోయింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ఇండియా కూటమిలో చేరుతోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఢిల్లీ నేతను అరెస్ట్‌ చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితను కాపాడేందుకు ఈ కేసును వాడుకున్నారు. ఇక, తెలంగాణలో అందెశ్రీ పాటను అధికార గీతం చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము. తెలంగాణలో బీజేపీ డబుల్‌ డిజిట్‌ రావడం ఖాయం. ఆగస్టు సంక్షోభం వస్తే మేము రక్షించే ప్రసక్తే లేదు అంటూ కామెంట్స్‌ చేశారు.

 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)