Breaking News

లోక్‌సభ స్పీకర్‌పై ఉత్కంఠ.. ఖర్గే సహా కూటమి నేతలతో చర్చలు

Published on Tue, 06/25/2024 - 10:52

ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయంపై తీసుకువచ్చేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు రంగంలో దిగారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల ఇండియా కూటమిని ఒప్పించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో పాటు ఇతర నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రతిపక్షాల ఇండియా కూటమి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ కోసం పట్టుపడుతున్న విషయం తెలిసిందే. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక నామినేషన్‌కు మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ముగియనుండటంతో ఇరు కూటముల మధ్య ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు మాజీ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈసారి కూడా బీజేపీ ఓం బిర్లాను స్పీకర్‌గా ఎంపిక చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.​ ఇప్పటి వరకు ఎన్నికైన లోక్‌సభ స్పీకర్లు అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.  ఇక, స్పీకర్‌ ఎంపికకు ఎన్నిక జరిగితే.. ఇలా ఎన్నిక జరగటం ఇదే తొలిసారి అవుతుంది.డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించటం ఆనవాయితీగా వస్తోంది. 2014లో బీజేపీ తన మిత్ర పక్షం అన్నాడీఎంకే ఎంపీ ఎం తంబిదురైని డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేసింది. ఇక.. 2019 నుంచి ఆ పోస్ట్‌ ఖాళీగా ఉంది.

16,17 లోక్‌సభల్లో కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్షహోదా కూడా దక్కలేదు. కానీ, ఈసారి లోక్‌సభ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ 99 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అందుకే కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ దక్కించుకోవాలని పట్టుపడుతోంది.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు