Breaking News

కామారెడ్డి నుంచే కేసీఆర్‌ పతనం: షబ్బీర్‌ అలీ

Published on Mon, 08/21/2023 - 21:17

న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్‌ పతనం కామారెడ్డి నుంచే మొదలవుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. సీఎం పోటీ చేసినా.. ఎవరు పోటీ చేసినా కామారెడ్డి అంటే షబ్బీర్‌ అని పేర్కొన్నారు. నేను కామారెడ్డి బిడ్డను, ఆశీర్వదించండి అని అడుగుతానన్నారు. గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌ ఎందుకు పారిపోతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ గెలిస్తే ఫామ్‌హౌస్‌కు వెళ్తారు.. నేను గెలిస్తే ప్రజల్లో ఉంటానని తెలిపారు.
సంబంధిత వార్త: KCR Press Meet: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

అభ్యర్థుల ప్రకటనపై కేసీఆర్‌ ముందే కూశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సెటైర్లు వేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న భయంతోనే లిస్ట్‌ అనౌన్స్‌ చేశారని విమర్శించారు. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్‌ మరోచోటికి వెళ్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌కే దిక్కు లేకుండా పోయిందని,  ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని అన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు.

పీపుల్స్‌ ప్రభుత్వ ఏర్పాటుకు సమయం వచ్చిందని తెలిపారు. సీఎల్పీ లీడర్‌గా పీపుల్స్ మార్చ్ చేశాక నేడు ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు చెప్పారు.  పాదయాత్ర అనుభవాలు, రాష్ట్ర రాజకీయాల గురించి ఖర్గేతో చర్చించినట్లు తెలిపారు. ఫిబ్రవరిలోనే కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం మొదలైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
చదవండి: మైనంప‌ల్లి వ్యాఖ్య‌ల‌పై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌..

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)