Breaking News

కేసీఆర్‌ ‘రీ ఎంట్రీ’ ఇక కలే: బండి సంజయ్‌

Published on Wed, 09/11/2024 - 15:44

హైదరాబాద్‌, సాక్షి: లోక్‌ సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీపై బీజేపీ మంత్రి బండి సంజయ్‌ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ క్విట్ ఇండియా అని వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం శేరిలింగంపల్లి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని హాట్‌  కామెంట్లు చేశారు.

‘‘రాహుల్ గాంధీ.. క్విట్ ఇండియా. విదేశాలకు వెళ్లి భారత ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తావా?. రిజర్వేషన్లపై నోటికొచ్చినట్లు మాట్లాడతావా?. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్‌కు సాధ్యం కావడం లేదు. కేసీఆర్ ఢిలీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంతు చూసేటోళ్లం. అంకుశం సినిమాలో రాంరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పట్టేది. కేసీఆరే దశమ గ్రహం.. నవగ్రహాలు చేయడం విడ్డూరం. వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు?. ప్రజలు కేసీఆర్ కు ‘నో ఎంట్రీ బోర్డు’పెట్టేశారు. ఇగ రీ ఎంట్రీ కలే. ఆరు గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో ‘హైడ్రామా’లాడుతున్నారు.

దేశ ప్రజలారా.. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగండి. అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన డివిజన్ కార్యకర్తలను నేను సన్మానిస్తా. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ బీజేపీదే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడం తథ్యం. లౌకికవాదులారా.. జైనూర్ ఘటనపై నోరెందుకు మెదపడం లేదు?. హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతుంటే ఎందుకు స్పందించరు?. జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించని వాళ్లు నా దృష్టిలో భారతీయులే కాదు’ అని అన్నారు.

చదవండి: ‘వాల్మీకి’ స్కామ్‌లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్‌

చదవండి: అప్పుడే రిజర్వేషన్లు తీసేయాలి: రాహుల్‌
 

Videos

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు