Breaking News

నాడు అత్త.. నేడు కోడలు..

Published on Tue, 11/03/2026 - 13:16

అనకాపల్లి: నాడు అత్త జెడ్పీటీసీగా ఈ ప్రాంత ప్రజలకు సేవలందించగా, ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన కోడలు  జెడ్పీటీసీగా బరిలో నిలిచారు. మునగపాక గ్రామానికి చెందిన ఆడారి సరోజిని 2001లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి జెడ్పీటీసీగా విజయం సాధించారు. సరోజిని గెలిచిన తరువాత ఐదేళ్ల కాలంలో మండల ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ అందరి మన్ననలు అందుకున్నారు. నేడు అదే కుటుంబం నుంచి పెద్ద కోడలైన ఆడారి కమల ప్రియ మునగపాక మండల జెడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీలో ఉన్నారు. 

గత కొద్ది రోజులుగా కమల ప్రియతో పాటు భర్త శ్రీకాంత్, అత్తమామలు సరోజిని, సత్యనారాయణలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. కమల ప్రియ కుటుంబ సభ్యులు కూడా తమకున్న పరిచయాలతో పాటు వైఎస్సార్‌సీపీకి చెందిన పెద్దలను కలుపుకొంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. 

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ జెడ్పీటీసీ అభ్యర్థి కమలప్రియ విజయానికి కృషి చేస్తున్నారు. గతంలో తన అత్త సరోజిని విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరూ తన విజయంలో కూడా భాగస్వాములు కావాలంటూ కమలప్రియ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మొత్తం మీద నాడు అత్త జెడ్పీటీసీగా పనిచేయగా, నేడు కోడలు జెడ్పీటీసీగా విజయం సాధించేందుకు కృషి చేస్తున్నారు.  

ఇదీ చదవండి: కూటమికి షాకిచ్చిన ఉద్యోగులు


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)