Breaking News

అంగళ్లు విధ్వంసం కేసులో బాబు ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు 

Published on Fri, 10/13/2023 - 05:19

సాక్షి, అమరావతి: యుద్దభేరి పేరుతో ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ శ్రేణులు సాగించిన విధ్వంసంపై ముదివీడు పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో గురువారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్ రెడ్డి తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నిర్ణయాన్ని వెలువరిస్తామన్నారు.

అంతకుముందు చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. అధికార పార్టీ కి చెందిన వారే అలజడి సృష్టించాలన్న ఉద్దేశంతో ర్యాలీపై రాళ్లదాడి చేశారని చెప్పారు. తమపై దాడిచేసి ఆ తరువాత నాలుగు రోజులకు తప్పుడు ఫిర్యాదు చేశారని, పోలీసులు సైతం వాస్తవాలు తెలుసుకోకుండానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇతర నిందితులందరికీ హైకోర్టు ఇప్పటికే బెయిల్‌ మంజూరు చేసిందన్నారు. 

చంద్రబాబు ప్రోద్బలంతోనే విధ్వంసం
పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు ప్రోద్బలంతోనే అంగళ్లు విధ్వంసం జరిగిందని చెప్పారు. పార్టీ శ్రేణులను రెచ్చగొట్టారన్నారు. అంగళ్లు వద్ద మొదలైన విధ్వంసం చిత్తూరు జిల్లా పుంగనూరు వరకు కొనసాగిందని, ఈ ఘటనలో పోలీసులు పెద్దసంఖ్యలో గాయపడ్డారని తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రిగా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి పూర్తి బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారని చెప్పారు. చంద్రబాబు ప్రోద్బలంతో జరిగిన ఈ దాడిలో పిటిషనర్, ఇతరులు గాయపడ్డారని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు బెయిల్‌కు అర్హులు కాదని, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును శుక్రవారం వెలువరిస్తానని తెలిపారు. 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)