ఏపీలో జంగిల్‌రాజ్‌కు వ్యతిరేకంగా ఒక్కటైన జనం

Published on Wed, 02/04/2026 - 12:07

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. జంగిల్‌ రాజ్‌కు వ్యతిరేకంగా జనం అంతా ఒక్కటయ్యారు. బుధవారం గుంటూరులో పోలీసుల ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రోడ్లపైకి భారీ సంఖ్యలో చేరి వైఎస్‌ జగన్‌ వెంట కదులుతూ చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తున్నారు. 

సాక్షి, తాడేపల్లి: వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా స్పష్టంగా కనిపించింది. టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించాలని చూస్తే.. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీస్‌ వ్యవస్థను రంగంలోకి దించి ఆ పర్యటనను విఫలం చేసే ప్రయత్నాలకు దిగింది. 

అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులిచ్చి మరీ బెదిరింపులకు దిగింది. గుంటూరుకు వెళ్లే రోడ్లన్నింటినీ పోలీసు చెక్‌పోస్టులతో నింపేయించింది. వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు.. ఆఖరికి అభిమానులను సైతం అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించింది. కానీ.. ఈ పరిణామాలన్నింటిని ప్రజలు నిశితంగా పరిశీలించారు. ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్న టీడీపీ అరాచకాలను చూసి అసహ్యింంచుకుంటున్న జనం.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. 

ఏపీలో జంగిల్‌రాజ్‌కు వ్యతిరేకంగా జనం ఒక్కటయ్యారు. జగన్‌ పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తే.. పోలీసుల ఆంక్షల వలయాల్ని చేధించుకుని స్వచ్ఛందంగా.. భారీగా, వేల సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు. పోలీసులు ఎప్పటిలాగే జగన్‌ పర్యటనలో భద్రత కల్పించకుండా దూరంగా ఉంటే.. ఆ జననేతకు జనమే సాదర స్వాగతం పలికారు. 

గుంటూరు పర్యటనలో అరుదైన దృశ్యాలు కనిపించాయి. జనం స్వచ్ఛందంగా ముందుండి వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ను ముందుకు నడిపించారు. జగన్‌ రాక నేపథ్యంలో గుంటూరు వెళ్లే రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. ఈ పరిణామాలను చూస్తున్న రాజకీయ విశ్లేషకులు.. ఇది కూటమి ప్రభుత్వంపై పెల్లుబికిన ప్రజాగ్రహమేనని, జగన్‌ వెంటనే తాము ఉన్నామంటూ ఇచ్చిన సంకేతాలని అంటున్నారు.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)