మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
‘పవన్‌కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయింది’
Published on Mon, 08/22/2022 - 19:02
సాక్షి, విజయవాడ: పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ, పవన్‌కు డీల్ కుదిరింది.. ప్యాకేజీ సెట్ అయ్యిందని దుయ్యబట్టారు. బీజేపీతో సంసారం.. చంద్రబాబుతో శృంగారం. ఇదీ పవన్ పార్టీ పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు. ‘‘జనసేన కాదు.. అది ‘నారా-నాదెండ్ల’ సేన. రాజకీయం అంటే సొంత కల్యాణం కాదు.. లోక కల్యాణం. పవన్‌కు ఉన్నది బాబు.. కావాల్సింది ప్యాకేజీ.’’ అంటూ నిప్పులు చెరిగారు.
చదవండి: ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: మాజీ ఎంపీ ఉండవల్లి
‘‘మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ ఉండగా పవన్‌కు వేరే ఆఫీసు ఎందుకు?. రాజకీయ కరువు బాధితుడు పవన్‌కు స్పెషల్ ప్యాకేజీలు అందాయి. టీడీపీ హయాంలో దుష్టచతుష్టయం, పవన్ కడుపు నిండింది. జనం కడుపు ఎండింది. 2019లో అన్ని చోట్లా గుండు గీశారు కాబట్టే జుట్టు పెంచుతున్నాడు. ప్రతి నమస్కారంతో పాటు ప్రతి ఒక్కరికి మంచి చేసే సంస్కారం జగన్‌కే సొంతం’’ అన్నారు.
Tags : 1