Breaking News

వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలతో సజ్జల కీలక వ్యాఖ్యలు

Published on Mon, 11/04/2024 - 21:00

తాడేపల్లి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్‌ చేసిన వేళ..  ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. పార్టీ ముఖ్యనేతలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది. ఏ సోషల్ మీడియా కార్యకర్తకు ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ ఆదేశించారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్న వారిపై న్యాయపోరాటం చేద్దాం. ఈ విషయంలో జిల్లా, నియోజకవర్గాల నాయకత్వం వెంటనే స్పందించాలి. పోలీసులు ఎవర్నైనా అరెస్టు చేస్తే న్యాయ సహాయం అందించాలి. ఇందుకోసం ఎక్కడికక్కడ పార్టీ తరఫున సమన్వయ కమిటీలు ఏర్పాటు కావాలి’’ నేతలకు దిశానిర్దేశం చేశారాయన.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై ప్రయివేటు కేసులు వేస్తామని ఈ సమావేశంలో సజ్జల అన్నారు. ‘‘సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తే పార్టీ లీగల్ టీం వెంటనే పీఎస్ లకు వెళ్లాలి. కావాల్సిన న్యాయ సహాయం అందించాలి. సీనియర్ అడ్వకేట్స్ తో కేంద్ర కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. 24 గంటలూ అందుబాటులో ఉండేలా కొందరు లాయర్లను ఏర్పాటు చేశాం. సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడుకోవటంలో ఎక్కడా వెనక్కు తగ్గాల్సిన పనిలేదు. వైయస్ జగన్, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటారు’’ అని సజ్జల చెప్పారు.

ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, సోషల్ మీడియా, లీగల్ సెల్ ముఖ్య నేతలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Videos

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)