Breaking News

Mangalagiri : ఒకరిది ధీమా.. మరొకరిది ఆందోళన

Published on Mon, 03/25/2024 - 16:36

ఒకరిది ప్రజా జీవితం.. మరొకరిది తెరవెనుక మంత్రాంగం.. ఒకరిది ధీమా.. మరొకరిది ఆందోళన.. ఒకరిది జనంతో మమేకమైన ప్రచారం.. మరొకరిది కార్పోరేట్‌ ప్రచారం. ఈ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎం. లావణ్య. మరొకరు నారా లోకేష్‌.   వైఎస్సార్‌సీపీ నుంచి మంగళగిరి నియోజకవర్గం నుంచి లావణ్య పోటీకి దిగుతుండగా, అక్కడ టీడీపీ తరఫున నారా లోకేష్‌ బరిలో ఉన్నారు. 

వీరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అయిన లావణ్య తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లతో మమైకమవుతున్నారు. సామాన్యులతో కలిసిపోతూ  ఎన్నికల ప్రచార హెరులో ముందు వరుసలో ఉన్నారు. జనంతో కలివిడిగా కలిసిపోతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వపు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. సీఎం జగన్‌ తనపై ఉంచిన నమ్మకంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు లావణ్య.   వంద శాతం గెలుపు ధీమాతో ప్రచారాన్ని సాగిస్తున్న లావణ్య.. ప్రస్తుతం మెజార్టీ ఎంత అనే దానిపైనే కన్నేశారు. 

అదే సమయంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌లో మాత్రం రోజు రోజుకు ఆందోళన ఎక్కువ అవుతోంది. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన లోకేష్‌కు మరొకసారి ఓటమి భయం వెన్నాడుతోంది. మంగళగిరిలో లోకేష్‌ జనంలోకి వెళ్లేదానికంటే ప్రైవేట్‌ మీటింగ్‌లతో సరిపెడుతున్నారు. ఓటర్లను గ్రూపులుగా విభజించడం, డబ్బులతో ఏ రకంగా కొనేయాలన్నదానిపై లోకేష్‌ సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. ఒకటి రెండు సార్లు జనంలోకి వెళ్లినా.. ప్రచారం మాత్రం సప్పగా సాగుతోందని స్థానికులంటున్నారు. కేవలం కార్పోరేట్‌ తరహా సమావేశాలు పెడుతూ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.

ఈ సారి విషమ పరీక్షే

చంద్రబాబు నాయుడు కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్‌.. ఇప్పటివరకు ఏ ఎన్నికలోనూ గెలిచింది లేదు. గత ఎన్నికల్లో మంగళగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేసి చిత్తుగా ఓడిపోయాడు లోకేష్‌. రాజకీయంగా ఆయన ఇప్పటికి సాధించిన అద్భుతాలు లేవు. లోకేష్‌ను ఏ రకంగానైనా ప్రమోట్‌ చేయాలన్న తాపత్రయంలో చంద్రబాబు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశాడు. అదేంటో గానీ.. జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం కాస్తా.. లోకేష్‌ సారథ్యంలో కనీసం తెలంగాణలో పోటీ కూడా చేయలేదు. మరే రాష్ట్రంలో పోటీ చేసే సత్తా గానీ, మద్ధతు గానీ లేదు. అయినా తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా చెప్పుకోవడం, దానికి జాతీయ కార్యదర్శిగా లోకేష్‌ను ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకే చెల్లింది. ఈసారి బోలెడు అపశకునాల మధ్య మంగళగిరిలో భవిష్యత్తు కోసం లెక్కలేసుకుంటున్నాడు. తేడా వచ్చిందా.? హెరిటేజ్‌ పాలమ్ముకోవడం తప్ప మరో దారి లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)