Breaking News

అన్నన్న చంద్రన్నా.. పచ్చి అబద్ధాలతో విద్యుత్ శ్వేత పత్రం!

Published on Tue, 07/09/2024 - 17:25

అమరావతి, సాక్షి: కాకి లెక్కలు.. పచ్చి అబద్ధాలతో పవర్ సెక్టార్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైట్‌పేపర్‌ ప్రసంగం సాగింది. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ.. గత ఐదేళ్లలో విద్యుత్‌రంగానికి జరిగిన మంచిని ఏమాత్రం ప్రస్తావించకుండా.. పైగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు చెబుతూ వింత వింత లెక్కలను తెరపైకి తెచ్చారు సీఎం చంద్రబాబు. 

మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇందులో తెలంగాణ ఇవ్వాల్సిన రూ. 7వేల కోట్ల విద్యుత్ బకాయిలు జగన్ వైఫల్యమన్న చంద్రబాబు.. తన పాలనలోనే తెలంగాణ విద్యుత్ వినియోగించుకున్నదని మాత్రం గుర్తించకపోవడం గమనార్హం. అలాగే.. ప్రభుత్వం శాఖలు ఇవ్వాల్సిన బిల్లులు కూడా వైఎస్ జగన్ వైఫల్యం అంటూ తప్పుడు ప్రచారం చేశారు.

చంద్రబాబు శ్వేత పత్రం.. జగన్‌ హయాంలో వాస్తవాల్ని పరిశీలిస్తే

👉పోలవరం జల విద్యుత్ కేంద్రం పూర్తికాక  4737 కోట్లు నష్టమంటూ మరో అబద్ధం అచ్చేసిన వైనం
వాస్తవానికి.. పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు వేగంగా జరిగింది వై ఎస్ జగన్ హయాంలోనే
చంద్రబాబు హయాంలో కనీసం పునాదులు దాటని జల విద్యుత్ కేంద్రం పనులు

👉ఎన్నికలకు ముందు ట్రూ అప్ ఛార్జెస్ రద్దు చేస్తామంటూ చంద్రబాబు ప్రచారం
ట్రూ అప్ ఛార్జెస్ రద్దు చేస్తారా?.. మీడియా ప్రతినిధులు అడిగిన సమాధానం చెప్పని చంద్రబాబు
.. రూ. 17,137 కోట్ల ట్రూ అప్ ఛార్జెస్ రద్దుపై మాట దాటేసిన చంద్రబాబు

👉విద్యుత్ ఛార్జీలు ఐదేళ్లు పెంచారా..? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేసిన చంద్రబాబు

👉చంద్రబాబు గత పాలనలోనే తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన విద్యుత్ రంగం
గత ఐదేళ్లలో విద్యుత్ రంగానికి ఊపిరిపోసిన వైఎస్ జగన్ ప్రభుత్వం
చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.68,596 కోట్ల అప్పుల్లో డిస్కమ్ లు
గత ఐదేళ్లలో డిస్కమ్ లకు నిధులు పెద్ద ఎత్తున చెల్లించిన వైఎస్ జగన్ ప్రభుత్వం
రూ. 56 వేల కోట్లు డిస్కమ్ లకు చెల్లించిన వైఎస్ జగన్ ప్రభుత్వం
 

ఇదీ చదవండి: మళ్లీ చంద్రబాబు మోసం.. ఉచిత ఇసుక ఒట్టిదే!

రాష్ట్ర ప్రయోజనాల కోసం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెద్ద ఎత్తున పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వం
కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎస్‌డీఎస్‌టీపీఎస్‌)లో 800 మెగావాట్లు,
నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 800 మెగావాట్ల యూనిట్లను జాతికి అంకితం
ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్ట్‌కు ఉమ్మడి పిన్నాపురంలో శంఖుస్థాపన
నెడ్‌కాప్‌ ఆధ్వర్యంలో  44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం

జగన్‌ హయాంలో.. వ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ను వచ్చే 30 ఏళ్ల పాటు కొనసాగించేందుకు, 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈసీఐ) తో ప్రభుత్వం ఒప్పందం
యూనిట్‌ కేవలం రూ.2.49 పైసలకే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం

సబ్సిడీ బకాయిలను కూడా సకాలంలో విడుదల చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం
గత ఐదేళ్లలో ఒక్క సారి కూడా పవర్‌ హాలిడే విధించకుండా సమర్థవంతంగా విద్యుత్ రంగ నిర్వహణ

వైజాగ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం

ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా రూ.3800 కోట్లు విలువైన 5600 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా చేసిన గత ప్రభుత్వం
 

  • వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఏపీ అధికారులు
  • ఏపీట్రాన్స్‌కో, నెడ్‌కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు, పీఎస్పీడీసీఎల్‌కు రెండు జాతీయ అవార్డులు
  • ‘కన్సూ్యమర్‌ సర్వీస్‌ రేటింగ్‌ ఆఫ్‌ డిస్కమ్స్‌’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని మూడు డిస్కంలకు ‘ఏ’ గ్రేడ్‌

    👉మాచ్‌ఖండ్‌లో ఒడిశా హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఓహెచ్‌పీసీ), ఏపీ జెన్‌కో సంయుక్తంగా మాచ్‌ఖండ్‌ ప్రాజెక్టు ఎగువ, దిగువ  98 మెగావాట్ల  సామర్థ్యం గల మూడు జల విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి  చర్యలు

    👉అప్పర్‌ సీలేరులో రూ.11,154 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే 1350 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజి ప్లాంట్‌ (పీఎస్పీ)కు కేంద్ర విద్యుత్‌ మండలి (సీఈఏ) నుంచి అనుమతి తీసుకువచ్చిన గత ప్రభుత్వం.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)