Breaking News

లోకేష్‌ పర్యవేక్షణలోనే పొదిలి ఘటన: అంబటి

Published on Wed, 06/11/2025 - 15:27

సాక్షి, గుంటూరు: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పొదిలి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై వైఎస్సార్‌సీపీ స్పందించింది. ఇదంతా ఆర్గనైజ్డ్‌గా వ్యవహారమని, మంత్రి నారా లోకేష్‌ పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

జగన్‌ పొదిలి వెళ్లింది పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు. గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారు. జగన్‌ రాక నేపథ్యంలో జనం భారీగా తరలి వచ్చారు. నలుగురైదుగురు మహిళలను పెట్టి నిరసన చేయించింది టీడీపీ నాయకులే. తెనాలి పర్యటన సమయంలోనూ ఇలాగే చేశారు. జగన్‌ పర్యటనల్లో నిరసనలు జరిగేలా మంత్రి నారా లోకేష్‌ చేస్తున్నారు. పొదిలి వ్యవహారాన్ని లోకేష్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. నల్లబెలూన్లు ఎగరేయడం, చెప్పులు విసిరించడం ఆర్గనైజ్డ్‌ కాదా? జగన్‌ పర్యటనలు చేయకూడదా?. మీరు అధికారంలో శాశ్వతంగా ఉంటారా? అని అంబటి ప్రశ్నించారు.  

.. పోలీస్ వ్యవస్థ టీడీపీ నాయకులకు అండగా ఉంది. వైఎస్సార్‌సీపీ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోంది. ఇదంతా లోకేష్‌ ఆధ్వర్యంలోనే నడుస్తోంది ఆ వేధింపులు, బెదిరింపులు భరించలేక కొందరు బలవన్మరణానికి ప్రయత్నిస్తున్నారు. రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన లక్ష్మీనారాయణ వైఎస్సార్‌సీపీ కార్యకర్త. ఆయన్ని గత కొన్ని రోజులుగా సివిల్‌ మ్యాటర్‌లో పోలీసులు వేధిస్తున్నారు. లక్ష్మీ నారాయణను సత్తెనపల్లి డీఎస్పీ బూతులు తిట్టారు. ఆ వేధింపులు భరించలేకనే ఆయన సెల్ఫీ వీడియో తీసి సూసైడ్‌కు ప్రయత్నించారు. ఆ వేధింపులు ఏస్థాయిలో ఉన్నాయో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది..

.. ప్రస్తుతం లక్ష్మీ నారాయణ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్‌ జగన్ రేపు(గురువారం, జూన్‌ 12) వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై జనం తిరగబడతారు. తూటాలు ఉపయోగించే పరిస్థితి కూడా రావొచ్చు’’ అని అంబటి జోస్యం పలికారు.

Ambati: పోలీసుల వేధింపులు తట్టుకోలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం చేశారు

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)