Breaking News

సెబీ చీఫ్‌పై ఆరోపణలు: దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్‌ పిలుపు

Published on Tue, 08/13/2024 - 17:03

ఢిల్లీ:అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్‌ ఫండ్‌లలో సెబీ ఛైర్‌పర్సన్‌ మాధవి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్‌ ఇటీవల విడుదల చేసిన నివేదిక వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో ఆమెను సెబీ ఛైర్‌ పర్సన్‌గా తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఆమెను ఛైర్మన్‌  పదవి నుంచి తొలిగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్‌ పార్టీ ఆగస్టు 22 దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ జనరల్‌ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 22న దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈడీ ఆఫీసుల ముందు భైఠాయించి నిరసనలు తెలుపుతాం. ఇవాళ(మంగళవారం) కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీలు, ఇన్‌ఛార్జ్‌లు, పీసీసీ ప్రెసిడెంట్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదానీ గ్రూప్‌, సెబీకి సంబంధించిన అతిపెద్ద కుంభకోణంపై చర్చించాం. అదానీ మెగా స్కామ్‌పై జేపీసీ ఆధ్వర్యంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారు.

చదవండి: ముగిసిన ఏఐసీసీ మీటింగ్‌.. సెబీ, అదానీలే టార్గెట్‌

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)