పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!

Published on Thu, 09/18/2025 - 11:07

పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుని ఇండియాకు వచ్చిన భారతసంతతికి చెందిన US పౌరురాలు అనూహ్యంగా కన్నుమూసిన ఘటన కలకలం సృష్టించింది. జూలైలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళ మిస్సింగ్‌ కేసు నమోదైన తరువాత షాకింగ్‌ విషయాలను పోలీసులు ప్రకటించారు.

పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్‌లోని లుధియానా జిల్లాలో అమెరికన్ పౌరురాలు పెళ్లి  చేసుకోవాలనే ఉద్దేశంతోఇండియాకు వచ్చింది. లూధియానాకు చెందిన ఇంగ్లాండ్‌కు చెందిన నాన్-రెసిడెన్షియల్ ఇండియన్ (NRI) చరణ్‌జిత్ సింగ్ గ్రెవాల్  (75)ను  వివాహం చేసుకోవాలని భావించింది. అతని ఆహ్వానం మేరకు రూపిందర్ కౌర్ పాంధేర్ (71) భారతదేశానికి  వచ్చారు. అయితే సియాటిల్ నుండి ఇండియాకు  వచ్చిన కొద్దిసేపటికే  ఏళ్ల మహిళ హత్యకు గురైంది. అయితే ఫోన్లకు స్పందించకపోవడం, ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ కావడంతో  అనుమానం వచ్చిన పాంధేర్ సోదరి కమల్ కౌర్ ఖైరా తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో జూలై 28న న్యూఢిల్లీలోని అమెరికిఆ రాయబార కార్యాలయానికి సంప్రదించారు.  ఎంబసీ ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు  చేరవేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గ్రెవాల్ ఆమెను కిరాయి హంతకులతో హత్య చేయించాడని  తేల్చారు.  ఆర్థికపరమైన కారణాల వల్లే ఈ హత్య జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు గ్రేవాల్‌తో పెళ్లికి ముందు అతనికి పెద్దమొత్తంలో డబ్బును బదిలీ చేసినట్టు కూడా గుర్తించారు. 

రూపిందర్  అమెరికా  పౌరురాలు. యూకేలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ చార్జిత్ సింగ్ గ్రెవాల్‌తో పెళ్లికోసం ఇండియాకు వచ్చింది. అయితే ఆమెను తుదముట్టించాలని పథకం వేసుకున్న గ్రెవాల్‌ కాంట్రాక్ట్‌ కిల్లర్‌ సుఖ్‌జీత్ సింగ్ సోనూతో రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆమెను కిరాతంగా హత్య చేయించాడు. అయితే ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే సమయంలోనే ఆమెను ఎవరో కిడ్నాప్‌ చేశాడని సోనూ దెహ్లోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానీ అతని వ్యవహారంపై అను​మానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా  అసలు విషయాన్ని అంగీకరించాడు. తన నివాసంలోని స్టోర్‌రూమ్‌లో రూపిందర్ శరీరాన్ని కాల్చి, బూడిద చేసి లెహ్రా గ్రామంలోని కాలవలో పారవేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఈ మేరకు సంఘటనా స్థలంలో మృతరాలి ఎముకలను స్వాధీనం చేసుకొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) హర్జిందర్ సింగ్ గిల్ , స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్‌ఓ) సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును విచారణ  సాగుతోంది.  పరారీలో ఉన్నగ్రెవాల్‌తో పాటు, అతడి సోదరుడిపై  కేసు  నమోదు చేశారు. సోను వెల్లడించిన దాని ఆధారంగా బాధితురాలి అస్థిపంజర అవశేషాలు, ఇతర ఆధారాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు పోలీసులు ఈ ఘటన ఇటు భారత్‌తోపాటు, అటు అమెరికా, యూకే  ఎన్‌ఆర్‌ఐ వర్గాల్లో ఆందోళన రేపుతోంది.

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)