Breaking News

దసరా వేడుకల్లో హద్దుమీరిన జంట.. వీడియో వైరల్‌

Published on Tue, 09/30/2025 - 08:58

దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సంప్రదాయ నృత్యాలు, అమ్మవారి అవతారాలకు ప్రత్యేక పూజలు, రావణ దహనం.. ఇలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలను చూడటానికి విదేశీ పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఎన్నారై జంట చేసిన పాడు పనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

గర్భా అనేది గుజరాతీ సంప్రదాయ నృత్యం. ప్రధానంగా నవరాత్రి ఉత్సవాల సమయంలో హైలైట్‌ అవుతుంటుంది. ఇది దేవీ దుర్గాను ఆరాధిస్తూ.. వృత్తాకారంగా(సర్కిల్‌) నృత్యం చేస్తుంటారు. గర్భా నృత్యం భక్తి, ఉత్సాహం, సామూహిక ఆనందాన్ని ప్రతిబింబించే కళారూపం. అలాంటి నృత్యంలో పాల్గొన్న ఓ జంట ముద్దులతో నలుగురిలో హద్దులు దాటేసింది.

గుజరాత్‌ వడోదరలో జరిగిన గర్బా వేడుకలో ఓ ఎన్నారై జంట చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యునైటెడ్‌ వే గర్భా పేరిట నిర్వహించిన వేడుకల్లో.. ప్రతీక్ పటేల్ అనే వ్యక్తి, తన భార్యతో కలిసి గర్భా చేస్తూ అత్యుత్సాహంలో ముద్దులు పెట్టుకున్న వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది. అది కాస్త వైరల్‌​ కావడంతో సనాతన్ సంత్ సమితి తీవ్రంగా స్పందించింది. ధార్మిక భావాలను దెబ్బతీశారంటూ ఆ జంటపై అటలదారా పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయ్యింది. 

అయితే విమర్శల నేపథ్యంలో ఆ జంట స్పందించింది. చేసిన పనికి లిఖితపూర్వక క్షమాపణ ఇచ్చింది. ఇది మా తప్పే. ఇంతలా విమర్శలు వస్తాయని అనుకోలేదు అంటూ  ఓ ప్రకటన విడుదల చేసింది.  గత 16 సంవత్సరాలు ప్రతీక్‌ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. తాజా వీడియోపై విమర్శల నేపథ్యంలో ఆ జంట దేశం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)