రెస్ట్‌ రూంలో కెమెరా : భారతీయ సంతతి వైద్యుడికి జైలు

Published on Wed, 07/22/2026 - 12:27

అమెరికాలో  వైద్య వృత్తిలో  ఉంటూ భారతీయ సంతతికి చెందిన వైద్యుడు తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. ఆసుపత్రిలోని విశ్రాంతి గది (Restroom)లో రహస్యంగా కెమెరా అమర్చి, రికార్డ్ చేసి, పైశాచిక ఆనందం పొందేవాడు. చివరికి కటకటాల వెనక్కి వెళ్లాడు. ఈ కేసులో వైద్యుడికి  ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నేరస్తుడు అద్వైత్ దేశ్‌ముఖ్ (Advait Deshmukh) టోలెడో యూనివర్విటీలో ఎండోయూరాలజీ, యూరోలాజిక్ ఆంకాలజీ విభాగంలో మూడో సంవత్సరం మెడికల్ రెసిడెంట్‌గా పనిచేసేవారు. జూన్ 2025లో ఓహియోలోని ప్రోమెడికా టోలెడో ఆసుపత్రిలోని ఒక యూనిసెక్స్ విశ్రాంతి గదిలో దాచి ఉంచిన ఒక సెల్‌ఫోన్‌ను ఒక ఉద్యోగి గుర్తించారు. ఆమె దాన్ని తీయడానికి ప్రయత్నించినప్పుడు, దేశ్‌ముఖ్ దానిని లాక్కొని అది తనదేనని చెప్పాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ప్రోమెడికా, టోలెడో పోలీసు బృందం సంయుక్తంగా దర్యాప్తు చేపట్టింది.

ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్‌ఫామెన్స్‌ బాలేదని పెయిడ్‌ లీవ్‌ : కంపెనీకి భారీ క్రేజ్‌

వీరి విచారణలో ఆ ఫోన్‌లో  2025 ఫిబ్రవరి - మే మధ్య తీసిన 80కి పైగా   ఫోటోలు, వీడియోలు లభించాయి. కనీసం ఆరుగురు బాధితులను పోలీసులు గుర్తించారు. ఇతగాడి పైశాచికం 2018 నుంచే జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ఇంకా ఎక్కువ మందే ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే విశ్వవిద్యాలయం దేశ్‌ముఖ్‌ను సస్పెండ్ చేసింది. అనంతరం ఆయన మెడికల్ రెసిడెన్సీని రద్దు చేసింది. అయితే అంతర్గత విచారణ అనంతరం రెసిడెన్సీ నియామకాన్ని పునరుద్ధరించ లేదని వెల్లడించింది. కోర్టులో శిక్ష ఖరారయ్యే ముందు దేశ్‌ముఖ్ బాధితులకు క్షమాపణలు చెప్పాడు.

టోలెడో ఆసుపత్రి ఉద్యోగి బాధితుల్లో ఒకరైన లిండ్సే ఈ సంఘటన తనను ఎంత కుంగదీసిందో వివరించారు.  తాను ఇప్పటికీ బాత్రూమ్‌లలో రహస్య కెమెరాల కోసం తనిఖీ చేస్తానని, ఆ చిత్రాలు ఎక్కడికి చేరాయోనన్న ఆందోళనన  తనను వెంటాడుతూనే ఉందంటూకోర్టు ముందు ఆవేదన వ్యక్తంచేశారు. 

సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిన ఒక అభియోగం, రహస్యంగా వీడియో తీసిన ఏడు అభియోగాలను అంగీకరించిన తర్వాత, దేశ్‌ముఖ్‌కు జూన్‌లో కోర్టు ఈయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు మూడేళ్ల ప్రొబేషన్ విధించింది. అంతేకాకుండా 15 ఏళ్ల పాటు 'సెక్స్ అఫెండర్' (లైంగిక నేరస్థుడిగా) నమోదు చేసుకోవాలని, మానసిక ఆరోగ్య చికిత్స పొందాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్‌ కారు కావాలి

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)