Breaking News

కొత్తకారుతో నిమ్మకాయల్ని తొక్కించబోయి..

Published on Wed, 09/10/2025 - 10:16

కొత్తగా కారు కొన్నాక కొందరు పూజలు చేయించి నిమ్మకాయలు తొక్కించి బండిని ముందుకు తీసుకెళ్లడం చూస్తుంటాం. అయితే అలాంటి ప్రయత్నాన్ని షోరూమ్‌లోనే చేయబోయింది ఓ మహిళ. పొరపాటు జరగడంతో 27 లక్షల విలువ చేసే కొత్తకారు యాక్షన్‌ సినిమాలో మాదిరి అద్దాలు బద్దలు కొట్టుకుని ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి భూమ్మీద బొక్కబొర్లాపడిపోయింది. 

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్‌ అనే మహిళ తన భర్త ప్రదీప్‌తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్‌ విహార్‌కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్‌ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి బయటకు తేవాలనుకుంది. ఈలోపు.. 

పొరపాటును ఎక్సలేటర్‌ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్‌ఫ్లోర్‌ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్‌ సీన్‌ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ కారు ధర రూ. 27 లక్షలుగా తెలుస్తోంది. 

అయితే మరికొన్ని మీడియా చానెల్స్‌ మాత్రం మరోలా కథనాలు ఇస్తున్నాయి. షోరూం సిబ్బంది ఆ భార్యభర్తలకు డెమో ఇచ్చే టైంలో ప్రమాదం జరిగిందనిప్రసారం చేస్తున్నాయి. డెమో ఇచ్చే టైంలో ఆ సిబ్బంది కారు ఇంజిన్‌ ఆన్‌ చేశాడని, హఠాత్తుగా ఆ మహిళ ఎక్సలేటర్‌ తొక్కడంతో కారు బయటకు దూసుకొచ్చిందన్నది ఆ కథనం సారాంశం. ఏదిఏమైనా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌​ అవుతున్నాయి. దీంతో పలువురు వ్యంగ్యంగా స్పందిస్తుననారు. దీనిపై ఆనంద్‌ మహీంద్రా స్పందించాలంటూ పలువురు నెటిజన్లు కోరుతుండడం గమనార్హం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)