Breaking News

ఆ భార్య బారి నుంచి దేవుడే రక్షించాడేమో!

Published on Sat, 08/02/2025 - 15:20

ఆ జంటకు పెళ్లై 16 ఏళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సొంతూరిలో ఇల్లు ఉండి కూడా.. సిటీలోనే కాపురం పెట్టాలన్న ఆమె కోరికను తీర్చాడా భర్త. అయినా ఎందుకనో ఆమె భర్తపై చంపేయాలన్నంత కసి పెంచుకుంది. భర్త హత్యకు గుండాలకు సుపారీ ఇచ్చింది. ఆ ప్రయత్నంలో.. భర్త బతికిపోగా, ఆమె ప్లాన్‌ బయటపడింది.

భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్య ఉదంతంలోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్‌ బరేలీలోని ఓ ఆస్పత్రిలో రాజీవ్‌ పని చేస్తున్నాడు. జులై 21వ తేదీ రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న అతనిపై గుంపుగా వచ్చిన 11 మంది దాడి చేసి చితకబాదారు.  అతని కాళ్లు, చేతులు విరగొట్టి కార్లలో సీబీ గంజ్‌ ఏరియా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. 

కనీసం సాయం కోసం అరవలేని స్థితిలో స్పృహ తప్పి పడిపోయాడు రాజీవ్‌.  అక్కడే సజీవంగా పాతేయాలని గొయ్యి తవ్వే ప్రయత్నంలో ఉన్నారు ఆ గుండాలు. ఇంతలో.. ఏదో అద్భుతం జరిగినట్లుగా ఓ వ్యక్తి అటుగా వచ్చాడు. ఆ బ్యాచ్‌ను చూసి గట్టి గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. 

కంగారుపడిపోయిన ఆ దుండగులు రాజీవ్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. ఆపై ఆంబులెన్స్‌కు కాల్‌ చేసిన ఆ అపరిచితుడు.. రాజీవ్‌ను ఆస్పత్రిలో చేర్పించాడు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడిన రాజీవ్‌.. కుటుంబ సభ్యులకు జరిగిందంతా చెప్పాడు. బహుశా.. దేవుడే ఆ ఆజ్ఞాత వ్యక్తి రూపంలో వచ్చి తనను రక్షించి ఉంటాడని కన్నీటి పర్యంతం అవుతున్నాడు రాజీవ్‌.

రాజీవ్‌ తండ్రి ఇజ్జత్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. దాడి చేసిన 11 మందిలో రాజీవ్‌ సొంత బావమర్దులే ఐదుగురు ఉండడం విశేషం. రాజీవ్‌ భార్య సాధన ఈ హత్య కుట్రకు ప్రధాన సూత్రధారిగా తేలింది. గత కొంతకాలంగా ఆమె పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటున్నట్లు పోలీసులు ధృవీకరించుకున్నారు. అయితే ఆమె భర్తను ఎందుకు చంపాలనుకుందో తెలియాల్సి ఉంది. స్థానికులు ఆ భార్యభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో తరచూ గొడవలు జరిగేవని చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సాధన, ఆమె సోదరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ఇదీ చదవండి: కొద్ది రోజులు ప్రియుడు.. కొద్ది రోజులు భర్త..!

ఇదీ చదవండి: పడక సుఖం ఇవ్వని భర్తను ఆ భార్య ఏం చేసిందంటే..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)