Breaking News

Operation Sindoor: ‘ఆపరేషన్‌ సింధూర్‌’ అంటే ఏమిటి?

Published on Wed, 05/07/2025 - 08:47

delhi: పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్‌.. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్‌ సింధూర్‌’ (Operation Sindoor) మంగళవారం అర్ధరాత్రి పాక్‌ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. తాజా సమాచారం మేరకు ఆపరేషన్ సింధూర్‌లో 80 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్లు అంచనా. అయితే ఈ దాడికి ముందే విజయం కోసం సాధన.. దాడికి సిద్ధం..! అంటూ  ఇండియన్‌ ఆర్మీ ఓ హింట్‌ కూడా ఇచ్చింది. నిమిషాల వ్యవధిలో పాక్‌పై దాడికి దిగింది. ఈ మెరుపు దాడికి ‘ఆపరేషన్‌  సిందూర్‌’ అని పేరు పెట్టింది.

పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్‌ ఆర్మీ ఆపరేషన్‌ సిందూర్‌ అని పేరు ఎందుకు పెట్టిందనే అంశంపై చర్చ కొనసాగుతోంది.  

సింధూరం అనేది దుర్గా, శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. సింధూరాన్ని మొదటగా శివుడు ఉపయోగించాడు. వివాహ సమయంలో పరమ శివుడు పార్వతి దేవి నుదుటిన సింధూరం పెట్టాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ప్రతి హిందూ వివాహంలో భాగంగా మారింది. ఈ ఆచారం భర్తల పట్ల భార్యలకు ఉన్న గౌరవం, విధేయతను తెలియజేస్తుంది. ఈ సింధూరం భార్యలు.. భర్తలను కాపాడే పవిత్ర సంకేతం మాత్రమే కాదు. ఓ యోధుని తలపై ధరించే గర్వ తిలకం కూడా.  

సింధూరం భారతీయ సాంస్కృతికలో  వివాహ తత్వానికి మాత్రమే కాదు, ధర్మ యుద్ధానికి కూడా చిహ్నం. రాజపుత్‌లు, మరాఠా యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ధరించే తిలకం అది. ఇప్పుడు అదే తిలకం రూపంలో భారత్‌.. పాక్‌ ఉగ్ర శిబిరాలపై దాడి చేసినట్లు ప్రపంచానికి తెలిపింది. ఇది కేవలం ప్రతీకార దాడి కాదు. ఇది నీతికోసం, ధర్మంకోసం, దేశ ప్రజల రక్షణ కోసం చేసిన ఓ చర్యకు ప్రతీకగా నిలుస్తోంది. 

దేశాన్ని కుదిపేసిన వినయ్‌ నర్వాల్‌ ఘటన 
ఏప్రిల్‌ 22న పహల్గాంలోని బైసరన్‌ లోయలో సేదదీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి.. వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌నే.  వినయ్‌ నర్వాల్‌ దంపతులకు పెళ్లై అప్పటికి ఆరు రోజుల క్రితమే. టెర్రరిస్టులు వినయ్‌ను హత్య చేయగా.. అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి నర్వాల్‌ చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీని చూడొచ్చు.  

దెబ్బకు దెబ్బ తీసింది
ఉగ్రవాదులు మతం ఆధారంగా ప్రాణాలు తీస్తామని సంకేతాలిస్తే.. భారత్‌ అదే దారిలో నడిచింది. దెబ్బకు దెబ్బ తీసింది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో అగ్నితో, ఆగ్రహంతో, ధర్మ యుద్ధాన్ని ప్రకటించింది. భారత ప్రజల హృదయాలను తాకేలా, ప్రపంచానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది. 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)