Breaking News

మీ తెలివికి హ్యాట్సాఫ్‌ అంకుల్‌.. నెక్స్ట్‌ లెవల్‌ అంతే!

Published on Tue, 08/17/2021 - 18:27

కరోనా వైరస్‌ ఇంకా పూర్తిగా అంతమవ్వలేదు. కోవిడ్‌ను అరికట్టేందుకు, మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండేందుకు వ్యాక్సినేషన్‌ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. యువత నుంచి పండు ముసలి వరకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పని సరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలి. ప్రస్తుతం ప్రపంచమంతటా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మొదట్లో వ్యాక్సిన్‌ తీసుకుంటే దుష్ప్రభావాలు తలెత్తుతాయనే అనుమానంతో వెనకడుగు వేసిన జనం ఇప్పుడు చురుగ్గా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే పలుచోట్లు వ్యాక్సిన్‌ కొరత ఏర్పడుతోంది. అవసరమైన డోసులు అందుబాటులో ఉండటం లేదు.
చదవండి: మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.. కంటతడి పెట్టిస్తున్న యువతి వీడియో

ఈ నేపథ్యంలో తాజాగా ఓ వ్యక్తి వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందేంటి.. రోజు లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకుంటుంటే అతను వేసుకోవడంలో గొప్ప విషయం ఏముంది అనుకుంటున్నారా.. అసలేం జరిగిందంటే.. టీకా కోసం వ్యాక్సినేషన్‌లో జనాలు బారేడు లైను కట్టారు. అయితే 35 నుంచి 45 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఆ క్యూలో నిల్చుంటే తన వంతు వచ్చే సరికి ఆలస్యం అవుతుందని గ్రహించాడు. దీంతో  ఆ వ్యక్తి  వ్యాక్సినేషన్‌ గదిలోకి వెళ్లి లైనులో నిల్చొని టీకా తీసుకోకుండా.. భవనం వెనక కిటికి ద్వారా మురికి కాలువపై అడ్డంగా నిల్చొని  సిబ్బందితో వ్యాక్సిన్‌ వేయించుకున్నాడు. ఇది నిజంగానే జరిగిందండోయ్‌.. దానికి ఈ వీడియోనే సాక్షం.. కావాలంటే మీరూ చూడండి.
చదవండి: భావోద్వేగం: వధువుని అలా చూసి కంటతడి పెట్టిన వరుడు

అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ ఫేస్‌బుక్ యూజర్ తరుణ్ త్యాగి దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇప్పటి వరకు దీనికి లక్షల్లో వ్యూవ్స్‌ లభించగా వేలల్లో లైకులు వచ్చి చేరుతున్నాయి. అంతేగాక అంకుల్‌ తెలివిని నెటిజట్లు ప్రశంసిస్తున్నారు. ‘సోదరుడు చాలా తెలివిగా కనిపిస్తున్నాడు. అతడికి దండం పెట్టాలి. టీకా తీసుకోవడంలో వేరే లెవల్‌ ఇది. గుడ్‌ ఐడియా.. ఈమాత్రం తెలివుంటే చాలు.. ఇన్ని రోజులు లైనుల్లో కష్టపడి వెయిట్‌ చేసేవాళ్లం.’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Videos

S400 చూసి వణికిపోతున్న పాక్ ఫేక్ ప్రచారంతో శునకానందం

మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం

బగ్లీహార్, సలాల్ డ్యామ్స్ గేట్లు తెరిచిన ఇండియా

మురిద్కే దాడిలో అబు జుందాల్ హతం

మోదీ హైలెవల్ మీటింగ్ కీలక అంశాలు

పాక్ దళాలు, కాన్వాయ్ లపై బీఎల్ఎ దాడులు

శిలాఫలకాలు పగలగొట్టడం పై ఉన్న శ్రద్ధ ప్రజలకు మంచిచేయడంపై లేదా?

చంద్రబాబు నాయుడు అబద్ధాల కోరు హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్సార్ పుణ్యమే

వీర జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించిన YSRCP లీడర్లు

భారత్ ఆర్మీ బయటపెట్టిన సంచలన వీడియో

Photos

+5

పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్‌ (ఫొటోలు)

+5

‘#సింగిల్‌’ మూవీ సక్సెస్ మీట్‌ (ఫొటోలు)

+5

అత్యంత వైభవంగా తిరుపతి గంగమ్మ తల్లి జాతర (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మిస్‌ వరల్డ్‌ పోటీలకు అంతా సిద్ధం (ఫొటోలు)

+5

HIT3 సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భారత సైన్యానికి మద్దతుగా.. (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ + వెస్ట్రన్‌... లాపతా లేడీ సరికొత్త స్లైల్‌ (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో ఒకప్పటి హీరోయిన్ మీనా సందడి (ఫొటోలు)

+5

హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి రోజు.. భర్తతో ఇలా (ఫొటోలు)

+5

War Updates: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ