Breaking News

కేరళలో అమిత్‌ షా.. ‘స్వామి కార్యం.. స్వకార్యం’

Published on Sun, 01/11/2026 - 13:06

తిరువనంతపురం: కేరళ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అటు అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించడంతో పాటు పార్టీ (బీజేపీ) కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. నేడు (ఆదివారం) పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించిన అమిత్‌ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి కేరళ చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్ల్రాలు ధరించిన అమిత్ షాకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఆరేళ్లకు ఒకసారి జరిగే ‘లక్షదీపం’ ఉత్సవానికి ఆలయం సిద్ధమవుతున్న తరుణంలో అమిత్‌ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 14న ఆలయంలో లక్ష దీపాలను వెలిగించే మహోత్సవం జరగనుంది.

ఆలయ దర్శనం అనంతరం అమిత్ షా రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా గడపనున్నారు. ఇటీవల కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త ప్రతినిధులతో ఆయన సమావేశమై, వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఒక ప్రత్యేక సదస్సులో పాల్గొన్న అనంతరం, సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్‌డీఏ కూటమి నాయకులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ శ్రేణులకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కేరళ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అమిత్ షా ‘మిషన్ 2026’ను ఈ పర్యటన ద్వారా లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2025లో ఆయన ప్రారంభించిన ‘మిషన్ 2025’ వ్యూహం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే  ఉత్సాహంతో 2026 శాసనసభ ఎన్నికల్లో చారిత్రాత్మక మార్పు తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో అమిత్ షా జరిపే చర్చలు అత్యంత కీలకం కానున్నాయి. కేరళలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది.

ఇది కూడా చదవండి: ‘మకర జ్యోతి’కి సర్వం సిద్ధం.. భక్తుల నియంత్రణ ఇలా..

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)