Breaking News

హిందీని రుద్దితే ఊరుకోం 

Published on Fri, 06/27/2025 - 05:37

ముంబై: మహారాష్ట్రలోని స్కూళ్లలో హిందీ భాష బోధనకు వ్యతిరేకంగా పోరాడుతామని శివసేన ‘యూబీటీ)చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన సోదరుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. గురువారం వీరిద్దరూ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. బీజేపీ భాష ఆధారంగా ప్రజలను విభజించాలని చూస్తోందని ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు. బలవంతంగా హిందీని రుద్దా లని చూస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. 

మరాఠా మాట్లాడే మహారాష్ట్రలో భాషాపరమైన అత్యవసర పరిస్థితిని తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. హిందీకి తాము వ్యతిరేకం కాదు, హిందీని ద్వేషించడం లేదంటూ.. తప్పనిసరి చేస్తే మా త్రం అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. మరాఠా, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు హిందీని బోధించడంపై ఆయన పైవిధంగా స్పందించారు. స్కూళ్లలో హిందీ బోధనను తప్పనిసరి చేయబోమని సీఎం ఫడ్నవీస్‌ ప్రకటిస్తేనే ఈ వివాదం సమసిపోతుందని ఠాక్రే తెలిపారు.

 స్కూళ్లలో హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ముంబైలో జూలై 7వ తేదీన జరిగే నిరసన ప్రదర్శనలో తమ పార్టీ పాల్గొంటుందని ఆయన వెల్లడించారు. మహారాష్ట్ర విద్యార్థులపై హిందీని బలవంతంగా రుద్దేందుకు చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా అడ్డుకుంటామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) గురువారం స్పష్టం చేసింది. జూలై 5వ తేదీన ముంబైలోని గిర్‌గామ్‌ చౌపట్టి నుంచి ర్యాలీ చేపడతామని ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ ఠాక్రే చెప్పారు. తమకు ఏ రాజకీయ పారీ్టతోనూ సంబంధం లేదన్నారు.

 హిందీని తప్పనిసరిగా బోధించాలనుకుంటే 5వ తరగతి తర్వాతే అమలు చేయాలని ఎన్‌సీపీ(ఎస్‌పీ)చీఫ్‌ శరద్‌ పవార్‌ సూచించారు. ఒకటో తరగతి నుంచే హిందీని నిర్బంధంగా బోధించాలన్న విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. ఉద్ధవ్, రాజ్‌ ఠాక్రే సోదరుల వైఖరిని ఆయన సమరి్థంచారు. మరాఠా భాషకు ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు. దీనిపై వారితో కలిసి ముందుకు సాగుతామన్నారు. మరాఠా భాష కోసం జరిగే నిరసనల్లో తామూ పాల్గొంటామని మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ హర్షవర్థన్‌ సప్కాల్‌ తెలిపారు. 

1, 2 తరగతులకు పుస్తకాలుండవు 
ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఎలాంటి పుస్తకాలు ఉండవని పాఠశాల విద్యా శాఖ మంత్రి దాదా భుసే చెప్పారు. ఈ రెండు తరగతుల చిన్నారులకు మౌఖికంగాను పాటలు, చిత్రాల ద్వారా బోధన ఉంటుందన్నారు. ఈ తరగతుల విషయంలో హిందీ ప్రసక్తే లేదని వివరించారు.  
 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు