Breaking News

అవమానిస్తున్నా నోరు మెదపరా? 

Published on Mon, 02/24/2025 - 05:10

న్యూఢిల్లీ: భారత్‌లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా కోట్ల రూపాయల నగదు విరాళాలు ఇచ్చిందని డొనాల్డ్‌ ట్రంప్, ఎలాన్‌ మస్క్‌లు పదేపదే చెబుతుంటే మోదీ సర్కార్‌ ఎందుకు మౌనం వహిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ సూటిగా ప్రశ్నించింది. ఈ విషయమై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి(ఇన్‌చార్జ్‌) జైరాం రమేశ్‌ ఆదివారం ‘ఎక్స్‌’లో  పలు పోస్ట్‌లుచేశారు. ‘‘అబద్దాలకోరులు, నిరక్షరాస్యుల ఊరేగింపు మందగా బీజేపీ తయారైంది. 

2.1 కోట్ల డాలర్లు ఇచ్చామని అమెరికా ప్రకటించినప్పటి నుంచీ బీజేపీ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. 2022లో భారత్‌కు అన్ని కోట్ల డాలర్లు వచ్చాయనేది అబద్ధం. ఆ డబ్బు బంగ్లాదేశ్‌కు వెళ్లింది. ఎలాన్‌ మస్క్‌ తప్పు చెప్పారు. ఢాకా అనిబోయి ట్రంప్‌ ఢిల్లీ అన్నారు.  బీజేపీ నేత అమిత్‌ మాలవీయ అబద్ధాలు ప్రచారంచేస్తున్నారు. దీనికి బీజేపీ వాళ్లు వంతపాడుతున్నారు’’అని జైరాంరమేశ్‌ అన్నారు. 

సీఈపీపీఎస్‌కు 48 కోట్ల డాలర్లు 
‘‘డోజ్‌ జాబితా ప్రకారం అమెరికా నుంచి రెండు యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూఎస్‌ఎయిడ్‌) గ్రాంట్లు రావాల్సి ఉంది. ఆ 48.6 కోట్ల డాలర్లు కన్షార్సియం ఫర్‌ ఎలక్షన్స్‌ అండ్‌ పొలిటికల్‌ ప్రాసెస్‌ స్ట్రెంథనింగ్‌(సీఈపీపీఎస్‌)కు రావాల్సిఉంది. ఇందులో 2.2 కోట్లు మాల్దోవా కోసం, మరో 2.1 కోట్లు భారత్‌లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు ఉద్దేశించినవి. 

ఇందులో తొలిగ్రాంట్‌ ఏఐడీ117ఎల్‌ఏ1600001 ఐడీతో మాల్దోవాకు ఇచ్చారు. 2.1 కోట్ల గ్రాంట్‌కు భారత్‌కు వెళ్లాల్సి ఉందని మస్క్‌ చెప్పింది అబద్ధం. ఈ గ్రాంట్‌ వాస్తవానికి బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సింది. నా ఓటు నాదే అనే కార్యక్రమం కోసం ఈ గ్రాంట్‌ను వినియోగించాలని బంగ్లాదేశ్‌లో నిర్ణయించారు. కానీ తర్వాత ఈ నిధులను నాగరిక్‌ కార్యక్రమం కోసం వినియోగించాలని నిర్ణయం మార్చుకున్నారు. ఈ విషయాన్ని యూఎస్‌ఎయిడ్‌ అధికారి స్పష్టం చేశారు’’అని జైరాం వెల్లడించారు. 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)