Breaking News

యూపీ ప్రచారానికి అగ్రనేతలు అనుమానమే?

Published on Fri, 11/15/2024 - 06:32

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేతల ప్రచారంపై సందిగ్ధత నెలకొంది. వయనాడ్‌ ఉప ఎన్నికకు పోలింగ్‌ ఈ నెల 13న ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాందీ, ప్రియాంకగాందీలు యూపీలో ఈ నెల 20న 9 స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భావించినా ఇంతవరకు పార్టీ తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

 ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా రాహుల్, ప్రియాంకలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వారు ప్రచారం చేయడం కష్టమేనని తెలుస్తోంది. నిజానికి యూపీలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేయాలని భావించింది. 9 స్థానాలకు గానూ కనీసంగా 4 స్థానాలకు తమకు వదిలేయాలని భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీని కోరినప్పటికీ ఆ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ నుంచి సానుకూల స్పందన రాలేదు. 

చివరి 2 స్థానాలు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకరించినా, గెలుపు అవకాశాలు లేకపోవడంతో వాటిల్లో పోటీకి కాంగ్రెస్‌ నిరాకరించింది. తొమ్మిది స్థానాల్లోనూ ఇండియా కూటమి తరఫున ఎస్పీ అభ్యర్థులే పోటీ చేస్తారని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో అఖిలేశ్‌ యాదవ్‌ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. అధికార బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

అయితే ఆయనకు మద్దతుగా కాంగ్రెస్‌ అగ్రనేతలు మాత్రం ఇంతవరకు ప్రచారంలో పాల్గొనలేదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ సహా మాజీ ఎంపీ పీఎల్‌ పునియాలు ఎస్పీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రచారం కోసం కాంగ్రెస్, ఎస్పీలు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

 రాష్ట్ర సీఎల్‌పీ నేత ఆరాధన మిశ్రా, కాంగ్రెస్‌ ఎంపీ తనూజ్‌ పునియాలు ఎస్పీతో కలిసి సంయుక్త ర్యాలీలు నిర్వహిస్తున్నా, అంతంతమాత్రం స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతలతో ఉమ్మడి ప్రచార ప్రణాళికను రూపొందించాలనే డిమాండ్‌లు వస్తున్నాయి. ఉమ్మడి ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభల కోసం సత్వరమే షెడ్యూల్‌ ఖరారు చేసి, అధికార బీజేపీ విభజన రాజకీయాలను బట్టబయలు చేసే కార్యాచరణ తీసుకోవాలని ఇరు పారీ్టల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా.. అగ్రనేతల ప్రచారంపై ఇంతవరకు ఏఐసీసీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.  

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు