Breaking News

భార్య హఠాన్మరణం.. అమితమైన ప్రేమతో ఆ భర్త..

Published on Wed, 02/22/2023 - 17:49

Viral News: ఆయనది అభిమానం కాదు. అమితమైన ప్రేమ. అంతకుమించిన పదంతో చెప్పాలంటే.. ఆరాధన. అందుకే ఆయన చేస్తున్న పని కూడా అంతే ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. చనిపోయిన భార్య తన కంటికి దూరం కాకూడదనే ఉద్దేశంతో.. ఆమెకు గుర్తుగా గుడిని కట్టించాడు ఓ పెద్దాయన.

తమిళనాడు కోయంబత్తూరులోని ఓ కుగ్రామంలో 75 ఏళ్ల పళనిస్వామి వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. 45 ఏళ్లపాటు పళనిస్వామి-సరస్వతమ్మల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. 2019 జనవరి 21న ఆయన సరస్వతి జబ్బు చేసి హఠాత్తుగా కన్నుమూసింది. కొంతకాలం ఆయన మానసికంగా కుంగిపోయాడు. అయితే.. ఆమె జ్ఞాపకాలను దూరం చేసుకోకూడదని బాగా ఆలోచించాడాయన. చివరికి భార్యకు గుడి కట్టించిన భర్తల కథలు తెలుసుకుని ఆ స్ఫూర్తితో.. తానూ ఆ పని చేయాలనుకున్నాడు. 

సరస్వతమ్మ కోసం ఓ గుడిని కట్టించాడు. భార్య మొదటి వర్థంతి నాడు విగ్రహ ప్రతిష్ట చేశాడు. ఆమె విగ్రహాన్ని నిత్యం శుభ్రం చేస్తూ.. రెండు పూటలా తన ఇంటి దీపానికి దీపారాధన చేస్తూ వస్తున్నాడు. ముంతాజ్‌ కోసం షాజహాన్‌ కట్టించిన తాజ్‌మహల్‌ ప్రేమ చిహ్నమంటూ చరిత్ర ద్వారా చెప్పుకోవడమే గానీ.. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమను కళ్లారా చూసినప్పుడు కలిగే ఆనందమే వేరు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)