Breaking News

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్‌ సిరప్‌ బ్యాన్‌

Published on Mon, 01/19/2026 - 17:10

దగ్గు మందు విషయంలో తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 'ఆల్మండ్ కిట్' దగ్గు సిరప్‌ను నిషేధించింది. దీని తయారీ, అమ్మకం, పంపిణీ , వినియోగాన్ని నిషేధించిందని రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. నిషేధాన్ని ఉల్లంఘించినట్లు తేలితే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

బిహార్‌లో తయారయ్యే ఈ సిరప్‌లో తీవ్రమైన, కొన్నిసార్లు ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలను కలిగించే ఇథిలీన్ గ్లైకాల్ అనే కలుషిత పదార్థం ఉందని అధికారులు తెలిపారు. ఈ సిరప్ తీసుకోవడం వల్ల తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం, మెదడు, ఊపిరితిత్తులకు నష్టం, కొన్ని సందర్భాల్లో మరణం సంభవించవచ్చని తమిళనాడు ఔషధ నియంత్రణ డైరెక్టరేట్ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని మెడికల్ షాపులు, డిస్ట్రిబ్యూటర్లు, ఆసుపత్రులు, ఫార్మసీలు వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ ఆదేశించింది. ప్రత్యేకంగా బ్యాచ్ నంబర్ AL24002ని తనిఖీ చేయాలని, ఈ సిరప్‌ను అస్సలు వాడకూడదని తెలిపింది.

ఈ సిరప్‌ను తయారు చేస్తున్నా, విక్రయిస్తున్నా, వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసీలు, ఆసుపత్రులలో తనిఖీలు, నిఘాను ముమ్మరం చేసింది. అంతేకాదు దీనికి సంబంధించిన, సమాచారం ఫిర్యాదులు లేదా తదుపరి సూచనల కోసం, ప్రజలు డైరెక్టరేట్‌ను 94458 65400 నంబర్‌లో వాట్సాప్ ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు. ఔషధాల కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని, లేబుల్‌లు మరియు బ్యాచ్ నంబర్‌లను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, ఏదైనా అనుమానాస్పదంగా. లేదా నాణ్యత లేని మందులను గుర్తిస్తే,  వెంటనే తమకు నివేదించాలని డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి: రూ. 50 నుంచి రూ. 100 కోట్లకు : ఆ సినిమానే ప్రేరణ

కాగా ఇటీవలి సంవత్సరాలలో, దేశంలో కలుషితమైన ఔషధ సిరప్‌లు,ఇథిలీన్ గ్లైకాల్ లేదా డైథిలీన్ గ్లైకాల్ కలిగిన సిరప్‌ల కారణంగా పిల్లల మరణాలు సంభవించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు, సురక్షితమైన, నాణ్యమైన మందులు మాత్రమే రోగులకు చేరేలా పర్యవేక్షణ విధానాలను బలోపేతం చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)