Breaking News

ట్రంప్‌ టారిఫ్‌ల కొట్టివేత అంశం: భారత్‌ స్పందన

Published on Sat, 02/21/2026 - 21:15

న్యూఢిల్లీ:  అధ్యక్ష హోదాలో డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో భారత్‌ స్పందించింది. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత ట్రంప్‌ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పరిణామాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నట్లు  కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. 

అమెరికా సుప్రీం కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును మేము గమనించాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయంపై ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమెరికా ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రకటించింది. ఈ పరిణామాలన్నింటినీ వాటి ప్రభావాలను అర్థం చేసుకోవడానికి మేము అధ్యయనం చేస్తున్నాము.  దానిని భారత ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. అవసరమైన ప్రతిస్పందనను వాణిజ్య మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ  ఇస్తాయి’అని తెలిపారు.

కాగా, పలు దేశాలపై విధించిన సుంకాల అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఆ దేశ సుప్రీంకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు ల్రంప్‌ విధించిన సుంకాలను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అమెరికా అధ్యక్షుడికి కానీ, వైట్‌హౌస్‌కు కానీ సుంకాలు విధించే అధికారం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. వాణిజ్య పరమైన అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధకారం కేవలం అమెరికా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని పేర్కొంది. దాంతో డొనాల్డ్‌ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. 

ఇవీ చదవండి
ట్రంప్‌ టారిఫ్‌లు కొట్టివేత.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు

నిజంగా ఇది సిగ్గు చేటు.. సుప్రీం కోర్టు తీర్పుపై ట్రంప్‌ ఫైర్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)