వీడియోలు కాదు, యాక్షన్‌ కావాలి : రాహుల్‌ గాంధీ విమర్శలు

Published on Sat, 07/25/2026 - 14:32

సాక్షి, న్యూఢిల్లీ:  నీట్‌ అవకతవకలపై దేశ రాజదాని నగరం న్యూడిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద సీజేపీ,విద్యార్థులు ఆందోళన నేపథ్యంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా విడుదల చేస్తున్న వీడియోలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ  బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీడియోలు కాదు, విద్యార్థులపై కోరుతున్న డిమాండ్లపై  చర్యలు కావాలి అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో దాడికి గురైన విద్యార్థులకు  ప్రధాని మోదీ వెంటనే  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

23 రోజులుగా నిరాహార దీక్ష చేసిన విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడిన రాహుల్‌ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యా వ్యవస్థ అవినీతికి ప్రతీక అని విమర్శించారు. ఆయనను వేరే శాఖకు మార్చడం కాకుండా, ప్రభుత్వం నుంచే పూర్తిగా తొలగించాలని (మంత్రివర్గం నుండి తీసేయాలని) విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు.మోదీ రాత్రివేళల్లో చేసే వీడియో సందేశాలను ప్రస్తావిస్తూ విద్యార్థులకు ప్రధాని హామీలు, వీడియోలు వద్దని, తక్షణ చర్యలే కావాలని స్పష్టం చేశారు.

 అలాగే ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్ ప్రయోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన ఒక విద్యార్థిని చూపిస్తూ... విద్యార్థులపై దాడికి బాధ్యులైన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. విద్యార్థులే ఈ దేశపు భవిష్యత్తు అని  మోదీ దేశానికి గతం అని  గతం ఎన్నటికీ భవిష్యత్తును ఓడించలేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా AISA ప్రతినిధి నేహా బోరా మాట్లాడుతూ, రాహుల్ గాంధీతో విద్యా వ్యవస్థపై చర్చలు జరిపినట్లు తెలిపారు. కాగా నీట్ 2026 పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి  మోదీ గురువారం అర్ధరాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో  మరో సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
 

 

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)