Breaking News

సీఎం కోటాలో నిన్ను ఐఏఎస్‌ను చేస్తా!

Published on Wed, 09/16/2026 - 12:16

‘‘మీరు చాలా అందంగా ఉంటారు. అంతకంటే మంచి మనసు కూడా ఉంది. మీ వ్యక్తిత్వమూ ఎంతో అద్భుతమైంది. ఇవన్నీ కాదండీ.. మీరు ఓ కంప్లీట్‌ ఉమెన్‌. మీరు చేసే పని మీకు అస్సలు సూట్‌ కాలేదు. నేను గనుక రాజకీయాల్లో కొనసాగితే.. రేపు మా పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కోటాలో మీకు ఐఏఎస్‌ జాబ్‌ ఇప్పిస్తా’’.. ఇలా ఓ వాట్సాప్‌ మెసేజ్‌ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

బ్యాంక్‌ ఉద్యోగి అయిన ఆమెను ఏకంగా ఐఏఎస్‌ను చేస్తానంటూ బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నాడా నేత. కాకపోతే అధికారంలోకి వస్తేనే ఆ పని చేస్తాడంట. అందుకోసం ఆమెను ‘కాంప్రమైజ్‌’ కావాలంటూ వేధించాడాయన!. ఓ బ్యాంక్‌ ఉద్యోగిని సంచలన ఆరోపణలతో ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో కలకలం రేగింది. సమాజ్‌వాదీ పార్టీ మైనారిటీ విభాగం కార్యదర్శి రాజన్‌ రిజ్వీ తనను వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిందామె. అంతేకాదు.. తనకు పంపిన పలు మెసేజ్‌లను మీడియా ముందు రిలీజ్‌ చేయడం తీవ్ర దుమారం రేపింది. 

''రోజూ నా వెంటపడే వాడు. ఏదో ఒక పని మీద రిజ్వీ రోజూ బ్యాంక్‌కు వచ్చేవాడని.. తోటి సిబ్బందిని ప్రలోభపెట్టి తన నెంబర్‌ సంపాదించాడని.. అప్పటి నుంచి వేధించడం మొదలుపెట్టాడని ఆమె ఆంటోంది. గట్టిగా నిలదీస్తే బెదిరింపులకు దిగాడ''ని ఆరోపిస్తోంది. అంతేకాకుండా.. ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తనకు సీఎం కోటాలో ఐఏఎస్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రిజ్వీ ఆశ చూపుతున్నాడని చెబుతోంది. ఈ మేరకు రిజ్వీ చేసినట్లుగా ఉన్న వాట్సాప్‌ మెసేజ్‌లను బయటపెట్టిందామె.

వేధింపులు ఎక్కువయ్యేసరికి తాను ఫోన్‌ ఎత్తడం మానేశానని.. దీంతో సరాసరి బ్యాంక్‌కు వచ్చి అందరి ముందే బెదిరించాడని చెప్పిందామె. అంతేకాదు.. తన కుటుంబాన్ని సైతం టార్గెట్‌ చేసుకున్నాడని.. గూండాలతో వాళ్లపై నిరంతరం నిఘా పెడుతున్నాడని వాపోయింది. భరించలేకనే ఇలా పోలీసుల ముందుకు రావాల్సి వచ్చిందని తెలిపింది. ఈ నేపథ్యంతో మధురలోని కొత్వాలి పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేయగా.. సెప్టెంబర్‌ 15న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఎస్పీ చర్యలు..
రిజ్వీ వ్యవహారాన్ని ఆధారంగా చేసుకుని అధికార బీజేపీ ప్రతిపక్ష ఎస్పీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అయితే కేసు నమోదైన నేపథ్యంలో రాజన్‌ రిజ్వీని సమాజ్‌వాదీ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. మహిళల భద్రత విషయంలో ఎలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చదవండి: ఇలా కలిశారో లేదో.. అలా పని జరిగిపోయింది!

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)