Breaking News

విపక్షాల భేటీకి సోనియా గాంధీ!..

Published on Tue, 07/11/2023 - 10:14

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ నెల 17, 18న జరిగే ప్రతిపక్షాల కీలక సమావేశానికి కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ సైతం హాజరయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సోమవారం చెప్పారు. ఈ భేటీలో పాల్గొనాలని సోనియాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారని తెలిపారు. దీనిపై సోనియా సానుకూలంగా స్పందించినట్లు,ఆమె రాబోతున్నట్లు తమకు సమాచారం అందిందని అన్నారు.

అలాగే, రాహుల్‌‌‌‌ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసినందుకు నిరసనగా ఈ నెల 12న ఇక్కడి ఫ్రీడమ్‌‌‌‌ పార్క్‌‌‌‌ వద్ద మౌన దీక్ష చేపట్టనున్నట్లు డీకే శివకుమార్ తెలిపారు. కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఒక్కటి కావాలని సూచించారు. దేశంలో మార్పు కోసం జరుగుతున్న మహా యుద్ధంలో పాల్గొనేందుకు ఎవరు ముందుకు వచ్చినా స్వాగతిస్తామని డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల తొలి సమావేశం జూన్‌ 23న బిహార్‌ రాజధాని పాట్నాలో జరిగిన సంగతి తెలిసిందే.   
చదవండి: ఉత్తరాది అతలాకుతలం.. ప్రమాదస్థాయికి చేరుకున్న యమున

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)