Breaking News

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటనకు తేదీలు ఖరారు

Published on Fri, 11/28/2025 - 13:24

న్యూఢిల్లీ :  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో చమురు కొనుగోళ్లు, రక్షణ మరియు వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చలు ఉంటాయని భావిస్తున్నారు.

దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము కూడా రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు స్వాగతం పలుకుతారు.  ఆయన గౌరవార్థం విందును ఏర్పాటు చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి 2025 డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశంలో అధికారిక పర్యటన చేస్తారు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

చదవండి: లక్ష కంఠ గీతా పారాయణం : ప్రధానికి ఘన స్వాగతం

పుతిన్ తన భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ  కూడా చర్చలు జరుపుతారు. పుతిన్ పర్యటన భారత, రష్యా ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సమీక్షించడానికి, ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాల మార్పిడికి అవకాశాన్ని కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

ఈ ఏడాది ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్ భారత పర్యటనను ప్రకటించారు. అయితే, ఆ సమయంలో తేదీలను ఖరారు చేయలేదు. తరువాత షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్ చైనాలో సమావేశమయ్యారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన తేదీలు ఖరారు

ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు
 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)