మోదీ ట్వీట్‌కు రాహుల్‌, సీజేపీ కౌంటర్‌

Published on Thu, 07/23/2026 - 10:23

సాక్షి, న్యూఢిల్లీ: నీట్‌ సహా పోటీ పరీక్షల పేపర్‌ లీకుల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్‌ ఇచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసింది కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించాయి.

ప్రధాని మోదీ స్పందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పేపర్‌ లీకులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఎవరినీ వదిలిపెట్టం’’ అని ప్రధాని స్పష్టం చేశారు.

రాహుల్‌ గాంధీ ఘాటు స్పందన
ప్రధాని ట్వీట్‌పై రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’’ అంటూ విమర్శించారు. పేపర్‌ లీకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన రాహుల్‌.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విద్యార్థులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

మంత్రి రాజీనామా చేయాల్సిందే:సీజేపీ
మరోవైపు, ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలు కొనసాగిస్తున్న సీజేపీ కూడా ప్రధాని మోదీ ట్వీట్‌పై స్పందించింది. పేపర్‌ లీకుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేసింది. అలాగే విద్యార్థులపై దాడులు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఉద్ఘాటించింది. అప్పటిదాకా తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేసింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేపీ కోరింది.

Videos

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)