Breaking News

పాక్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ బిగ్‌ వార్నింగ్‌

Published on Sat, 10/18/2025 - 13:54

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాయాది దేశం పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ ట్రైలర్‌ మాత్రమేనన్న ఆయన.. పాక్‌ భూభాగంలోని ప్రతీ అంగుళం ఇప్పుడు మన బ్రహ్మోస్‌ క్షిపణి పరిధిలో ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. 

శనివారం లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌లో తయారైన మొదటి బ్యాచ్ మిస్సైళ్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి రాజ్‌నాథ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది భారత రక్షణ పరిశ్రమకు ఒక మైలురాయి. శత్రువులు ఇప్పుడు మన పరిధిలోనే ఉన్నారు. 

.. బ్రహ్మోస్ నుంచి తప్పించుకోవడం శత్రువులకు ఇక అసాధ్యం. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే. దీని ద్వారా భారత సైన్యం తన శక్తిని నిరూపించింది. ఆ ట్రైలర్‌నే చూసి పాకిస్తాన్‌కి అర్థమై ఉంటుంది. భారత్‌ పాకిస్తాన్‌ను సృష్టించగలిగితే, ఇంకేమి చేయగలదో చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు విజయం మనకు అలవాటైపోయింది. బ్రహ్మోస్‌ కేవలం శక్తి ప్రదర్శన కాదని.. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే అడుగు’’ అని ఆయన అభివర్ణించారు. 

బ్రహ్మోస్ మిస్సైల్స్‌ను భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ టైంలో ప్రయోగించింది. Fire and Forget టెక్నాలజీతో పని చేయడం దీని ప్రత్యేకత. అంటే.. లక్ష్యాన్ని చేరిన తర్వాత మానవ ప్రమేయం లేకుండానే దాని పని అది చేసుకుపోతుంది.

భారత్‌ డీఆర్‌డీవో-రష్యా ఎన్‌పీఓఎం సంయుక్తంగా  బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరిట సంయుక్తంగా వీటిని డెవలప్‌ చేస్తున్నాయి. త్రివిధ దళాలు దీనిని ఉపయోగించుకుంటున్నాయి. హైదరాద్‌, తిరువనంతపురం, నాగ్‌పూర్‌లలో వీటి విడిభాగాలు తయారు అవుతున్నాయి. తాజాగా లక్నోలోనూ ఓ యూనిట్‌ను ప్రారంభించారు. తాజా వివరాల ప్రకారం.. బ్రహ్మోస్‌కు 75% వరకు స్వదేశీ భాగాలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అందుకే రాజ్‌నాథ్‌ దీనిని ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే కీలక అడుగు అని అన్నారు. 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)