‘ఎలక్షన్‌ చోరీ ఆయోగ్‌’

Published on Thu, 08/14/2025 - 05:42

న్యూఢిల్లీ: ఓట్ల చోరీపై విపక్ష కాంగ్రెస్‌ పార్టీ తమ పోరాటం ఉధృతం చేస్తోంది. పోలింగ్‌ బూత్‌లో ఒకరి బదులు ఇంకొకరు ఓటు ఎలా వేస్తున్నారో వివరిస్తూ ఒక వీడియోను పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ బుధవారం ‘మీ ఓటు చోరీ, మీ అధికారం చోరీ, మీ గుర్తింపు చోరీ’ అనే శీర్షికతో సోషల్‌ మీడియాలో చేశారు. ఓటర్ల జాబితాలో గోల్‌మాల్‌పై ప్రజలంతా గొంతు విప్పాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడుకోవాలని చెప్పారు. 

వీడియోలో ఏముంది?
కాంగ్రెస్‌ విడుదల చేసిన వీడియోలో ఆసక్తిక రమైన సన్నివేశం కనిపిస్తోంది. ఇందులో ఓ కుటుంబం ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి వెళ్తుంది. ఇద్దరు వ్యక్తులు ఆ కుటుంబానికి తారసపడతారు. మీ ఓట్లు మేమే వేశాం, ఇక మీరు వెళ్లిపోవచ్చు అని చెప్తారు. దొంగ ఓట్లు వేసిన ఆ ఇద్దరు వ్యక్తులు పోలింగ్‌ కేంద్రంలోని ఎన్నికల అధికారికి బొటన వేలు పైకెత్తి విజయం చిహ్నం చూపిస్తారు. ఆ అధికారి టేబుల్‌పై ‘ఎలక్షన్‌ చోరీ ఆయోగ్‌’ అనే నేమ్‌బోర్డు ప్రత్యక్షం అవుతుంది. 

నేడు దేశవ్యాప్తంగా ర్యాలీలు: ఓట్ల చోరీపై దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం భారీ ర్యాలీలు నిర్వహించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 
 

Videos

DSCపై లోకేష్ తో బహిరంగ చర్చకు సిద్ధం.. అభ్యర్థి సంచలన సవాల్..!

వైఎస్ జగన్ పాదయాత్ర.. తేదీ ఖరారు..!

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

చరిత్ర సృష్టించిన రష్మిక

DSCలో అవినీతి బట్టబయలు..! లోకేష్ రాజీనామా..?

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

Photos

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)