Breaking News

ఇది మా వారసత్వం! ప్రియాంక ఉద్వేగభరిత ప్రసంగం

Published on Mon, 03/27/2023 - 13:05

కాం‍గ్రెస్‌ నేత రాహుల్‌గాంధీపై లోక్‌సభ అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం ఆ పార్టీ కార్యదర్మి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో కాంగ్రెస్‌ రాజ్‌ఘాట్‌ వద్ద సంకల్ప సత్యాగ్రహ దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియాంక ఆ కార్యక్రమంలో ఉద్వేగభరితంగా చేసిన ప్రసంగాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నారు.

ఈ మేరకు ప్రియాంక గాంధీ ఆ ప్రసంగంలో.. "మూడు దశాబ్దాల నాటి సంఘటనను వివరించారు. సరిగ్గా 32 ఏళ్ల క్రితం మా నాన్న(రాజీవ్‌ గాంధీ) అంతక్రియల ఊరేగింపు తీన్‌మూర్తి భవన్‌ నుంచి బయలుదేరుతోంది. భద్రతా బెదిరింపులు ఉన్నప్పటికీ రాజ్‌ఘాట్‌కు వరకు తన తండ్రి అంత్యక్రియల ఊరేగింపుకి వెళ్లేందుకు ఎలా పట్టుబట్టారో తెలిపింది.

అప్పుడూ మా నాన్న మృతదేహాన్ని త్రివర్ణ పతాకంలో చుట్టారు. అలాంటి అమరవీరుడి తండ్రిని పార్లమెంటులో అవమానించారు. ఆ అమరవీరుడి కుమారుడిని మీరు దేశ వ్యతిరేకి అంటారు. ఈ సందర్భంగా ప్రియాంక పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చను ప్రస్తావిస్తూ.. ఈ కుటుంబం నెహ్రూ ఇంటి పేరు ఉపయోగించేందుకు ఎందుకు సిగ్గుపడుతున్నారో అంటూ హేళన చేశారు.

మోదీ తన వ్యాఖ్యలతో మొత్తం కుటుంబాన్నే గాక కాశ్మీర్‌ పండిట్ల సంప్రదాయాన్నే అవమానించారు. దీనికి మీపై ఎటువంటి కేసు లేదు. అలాగే రెండేళ్ల పదవీకాలంపై వేటు పడదు, అనర్హులుగా ‍ప్రకటించరు కూడా.  ఎందుకు ఇలా అని ప్రియాంక ఆగ్రహంగా ప్రశ్నించారు.

ఈ మేరకు రాహుల్‌ గాంధీ సత్యాగ్రహ దీక్షలో ప్రియాంక ప్రసంగించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేస్తూ.. సత్యం, ధైర్యం, త్యాగం మా వారసత్వం. ఇదే మా బలం అని రాసుకొచ్చారు. కాగా, ఆమె ఆ ప్రసంగంలో.. అమరులైన ప్రధాని కుమారుడు, పైగా జాతీయ సమైక్యత కోసం వేలకిలోమీటర్లు నడిచిన మహోన్నత వ్యక్తి (రాహుల్‌) ఎప్పటికీ దేశాన్ని అవమానించలేడని ప్రియాంక గాంధీ నొక్కి చెప్పారు.

అంతేగాదు ఈ దేశ ప్రధాని పిరికివాడని, అధికారం వెనక దాక్కున్నాడంటూ ఘాటుగా విమర్శించారు. ఈ దేశ ప్రజలు కచ్చితంగా అలాంటి దురహంకారి రాజుకి తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆమె అన్నారు.  

(చదవండి: తేజస్వీ యాదవ్‌కు పుత్రికోత్సాహం! పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన రాచెల్‌)

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు