Breaking News

నేడే బిహార్‌ తొలి దశ పోలింగ్‌

Published on Thu, 11/06/2025 - 05:18

పట్నా: బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలి దశలో 121 నియోజకవర్గాల్లో హోరాహోరీగా ప్రచారం జరగ్గా నేడు పోలింగ్‌ అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మొదలుకానుంది. అధికార ఎన్‌డీఏ, విపక్షాల మహాగఠ్‌బంధన్‌ కూటమి అభ్యర్థులు సహా మొత్తం 1,314 అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు తొలి దశలో 3.75 కోట్ల మంది ఓటర్లు సిద్ధమయ్యారు. 

గురువారం మొత్తంగా 45,241 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరగనుంది. వీటిల్లో 36,733 కేంద్రాలు గ్రామీణప్రాంతాల్లో ఉండటం గమనార్హం. గురువారం ఓటేస్తున్న వారిలో 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. విపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, బీజేపీ నేత, ప్రస్తుత డెప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి పోటీచేస్తున్న నియో జకవ ర్గాల్లోనూ గురువారం తొలిదశలోనే పోలింగ్‌ జరగనుంది. 

రాఘోపూర్‌లో హ్యాట్రిక్‌ కోసం తేజస్వీ కన్నేయగా, 2010లో రబ్రీ దేవిని ఓడించిన బీజేపీ నేత సతీశ్‌ కుమార్‌ ఈసారి తేజస్వీని ఓడించాలని తహతహలా డుతున్నా రు. రాఘోపూర్‌లో ఎలాగైనా తేజస్వీని ఓడించాలని జనసురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు, గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కంకణం కట్టుకున్నారు. పొరుగు నియోజకవర్గంలో తేజస్వీ సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ సైతం సొంతంగా జశక్తి జనతాదళ్‌ పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

 నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వంలో మంత్రి అయిన విజయ్‌ కుమార్‌ సిన్హా సైతం లఖీసరాయ్‌లో నాలుగోసారి గెలుపుపై గంపెడాశలు పెట్టుకు న్నారు. జనసురాజ్‌ పార్టీ కార్యకర్త హత్య కేసులో అరెస్టయిన జేడీయూ అభ్యర్థి అనంత్‌ సింగ్‌ పోటీచేస్తున్న మొఖానాలోనూ గురువారమే పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ ఆర్జేడీ తరఫున వీణాదేవి పోటీచేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘట నలు జరక్కుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు, పోలీసులు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)