Breaking News

ప్రపంచంలో అస్థిరత్వం.. భారత్‌లో స్థిరత్వం

Published on Mon, 01/12/2026 - 02:56

రాజ్‌కోట్‌: ప్రపంచమంతటా అస్థిర పరిస్థితు లు, ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, భారత్‌ లో మాత్రం గతంలో ఎన్నడూ లేనంత రాజకీయ స్థిరత్వం ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశంలో వ్యాపార ప్రగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయ ని పేర్కొన్నారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్‌లో పెట్టుబడులకు పూర్తి సానుకూల వాతావరణం ఉందన్నారు. 

ఆదివారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో వైబ్రాంట్‌ గుజరాత్‌ ప్రాంతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. భారత ఆర్థిక వ్యవస్థ నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. దేశ ప్రగతిలో గుజరాత్‌ కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. 

భారత్‌ పట్ల ప్రపంచ దేశాలు ఆకాంక్షలు నానాటికీ పెరుగుతున్నాయని, తాజా గణాంకాలు ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. దేశంలో మధ్య తరగతి వర్గం వేగంగా విస్తరిస్తోందని, వారి కొనుగోలు శక్తి పెరుగుతోందని చెప్పారు. తద్వారా వ్యాపార అభివృద్ధికి అవకాశాలు సైతం అదే స్థాయిలో పెరుగుతు న్నాయని వెల్లడించారు. మొబైల్‌ డేటా వినియోగంలో భారత్‌ అగ్రస్థానంలో ఉందన్నారు.  వైబ్రాంట్‌ గుజరాత్‌ సదస్సుకు దేశ విదేశీ పెట్టుబడిదారులు హాజరయ్యారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)