Breaking News

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్‌

Published on Thu, 10/02/2025 - 13:34

ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి  తెలుసుకున్నారు. ‘‘నేను ఖర్గేతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. అలాగే ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షు పొందాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు

కాగా, మల్లికార్జున ఖర్గేకు బుధవారం రాత్రి బెంగళూరు ఆస్పత్రి వైద్యులు పేస్‌మేకర్‌ను అమర్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బెంగళూరు వచ్చిన ఆయన శ్వాసలో ఇబ్బంది, జ్వరం రావడంతో మంగళవారం సాయంత్రం ఎంఎస్‌ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు.

తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే సోషల్‌ మీడియా లో..‘వయో సంబంధ సమస్యలు, శ్వాస సంబంధ సమస్యలతో ఖర్గే ఇబ్బంది పడుతున్నారు. వీటిని సరిచేసేందుకు పేస్‌మేకర్‌ అమర్చాలని వైద్యులు సలహా ఇచ్చారు’అని తెలిపారు. ఖర్గేకు బుధవారం రాత్రి వైద్యులు స్వల్ప శస్త్రచికిత్స జరిపి పేస్‌మేకర్‌ను విజయవంతంగా అమర్చారు. ఆయన ఆరోగ్యం బాగుందని, గురువారం డిశ్చార్జి అవుతారని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)