Breaking News

‘మోదీ పాక్‌తో వాణిజ్య సంబంధాలు ప్రారంభిస్తారని ఆశిస్తున్నా’

Published on Wed, 05/15/2024 - 10:10

వాషింగ్టన్‌: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా  శక్తిమంతమైన నాయకుడని ప్రముఖ పాక్‌ అమెరికన్‌ వ్యాపారవేత్త సాజిద్‌ తరార్ ప్రసంశలు కురిపించారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘మోదీ.. భారత్‌ను చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన మూడోసారి కూడా ప్రధాని అవుతారు. ప్రధాని మోదీ భారత్‌కే  కాకుండా ప్రపంచానికి కూడా మంచి చేస్తున్నారు. అందుకే మోదీ వంటి నాయకుడు పాకిస్తాన్‌కు కావాలి. పాక్‌తో మోదీ వాణిజ్య సంబంధాలు ప్రారంభిస్తారని ఆశిస్తున్నా.

ప్రశాంతంగా ఉండే పాకి​స్తాన్‌  భారత్‌కు కూడా మంచిదే. ఎక్కడ చూసిన మోదీ మళ్లీ ప్రధాని అవుతారని వినిపిస్తోంది. భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మోదీ ప్రజాదరణ చాలా అద్భుతం. భవిష్యత్తులో భారత్‌ ప్రజాస్వామ్యం నుంచి చాలా నేర్చుకుంటారు.

పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇక..  పీఓకేలో  విద్యుత్‌ చార్జీల  పెరగుదల కారణంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.  ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే మార్గాలను పాక్‌ వెతకటం లేదు. ఎగుమతులను పెంచటం. ఉగ్రవాదాన్ని నియంత్రణ చేయటం. శాంతి భద్రతలను మెరుగుపరటంలో చొరవ చూపటం లేదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి  సరైన నాయకత్వం కావాలని కోరుకుంటున్నా’అని సాజిద్‌ తరార్ తెలిపారు.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)