Breaking News

నిర్ణయాత్మక ఘట్టం ‘సిందూర్‌’

Published on Fri, 11/28/2025 - 05:37

న్యూఢిల్లీ:  ఉగ్రవాద వ్యతిరేక, నిరోధక చర్యల్లో ఆపరేషన్‌ సిందూర్‌ ఒక నిర్ణయాత్మక ఘట్టమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభివరి్ణంచారు. ఈ ఆపరేషన్‌ ద్వారా మన సైన్యం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిసొచ్చాయని అన్నారు. శాంతిని సాధించడంలో భారత్‌ అత్యంత దృఢంగా, అదే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ప్రపంచ దేశాలు అర్థం చేసుకున్నట్లు తెలిపారు. 

గురువారం ఢిల్లీలో ప్రారంభమైన ‘చాణక్య డిఫెన్స్‌ డైలాగ్‌’కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. మనదేశం ఆనాదిగా ‘వసుధైవ కుటుంబం’అనే సూత్రానికి కట్టుబడి ఉన్నట్లు గుర్తుచేశారు. ప్రపంచ దేశాలతో శాంతియుత సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. భారత్‌ కేవలం శాంతిని కోరుకుంటున్నట్లు మన దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, మన సైనిక దళాలు ఉమ్మడిగా నిరూపిస్తున్నట్లు స్పష్టంచేశారు.

 మరోవైపు దేశ సరిహద్దులను, ప్రజలను కాపాడుకోవడంలో ఎంతమాత్రం రాజీపడడం లేదని పేర్కొన్నారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని పరిరక్షించడంలో మన సైనిక దళాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని రాష్ట్రపతి ప్రశంసించారు. జవాన్ల పనితీరు, దేశభక్తిని కొనియాడారు. దేశ అభివృద్ధికి సైన్యం కీలకమైన ఆధారంగా నిలుస్తోందని వివరించారు. 

సరిహద్దు ప్రాంతాల్లో భద్రత మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనలో సైన్యం చురుగ్గా పనిచేస్తోందని గుర్తుచేశారు. నేడు ప్రపంచమంతటా శాంతికి, ఘర్షణకు మధ్య విభజన రేఖ చెదిరిపోతోందని పేర్కొన్నారు. అందుకే సైనిక దళాలపై బాధ్యత మరింత పెరుగుతోందని వెల్లడించారు. 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’లక్ష్య సాధనకు తోడ్పాటు అందించాలని సైన్యానికి రాష్ట్రపతి పిలుపునిచ్చారు.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)