Breaking News

కాల్పుల విరమణకు పాక్‌ అడుక్కుంది: జై శంకర్‌

Published on Wed, 07/30/2025 - 13:08

కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ పార్లమెంట్‌ వేదికగా మరోసారి స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చలో భాగంగా బుధవారం రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని వ్యాఖ్యానించారాయన. 

పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి తెలియజేశాం. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ‘సిందూర్‌’ పేరిట చేపట్టిన ఆపరేషన్‌తో ధ్వంసం చేసింది. కాల్పుల విరమణకు పాకిస్థాన్‌ అడుక్కుంది. అంతేగానీ కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదు అని అన్నారాయన. 

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి సంభాషణలు జరగలేదని జై శంకర్‌ వివరించారు. ఆ సమయంలో చాలా దేశాలు దౌత్యానికి ముందుకొచ్చాయి. కానీ,  జోక్యం సరికాదని ఆయా దేశాలకు చెప్పాం అని జైశంకర్‌ అన్నారు. ‘‘వాళ్లకు(ప్రతిపక్షాలకు) ఒక్కటే చెప్పదల్చుకున్నా.. ఏప్రిల్‌ 22 నుంచి జూన్‌ 16 మధ్య ఆ ఇద్దరు నేతలకు ఒక్క ఫోన్‌ కాల్‌ సంభాషణ జరగలేదు’’ అని స్పష్టం చేశారాయన.  

మే 9వ తేదీన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. పాక్‌ నుంచి దాడులు జరగవచ్చని హెచ్చరించారాయన. అయితే అలాంటి పరిస్థితి వస్తే భారత్‌ నుంచి ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని మోదీ వాన్స్‌తో చెప్పారు. ఆర్థికల్‌ 370, సింధూ జలాల ఒప్పందం.. నెహ్రూ పాలనలో జరిగిన ఈ తప్పిదాలను మోదీ సర్కార్‌ ఇప్పుడు సరిదిద్దుతోంది. ఉగ్రవాదాన్ని గ్లోబల్‌ ఎజెండాలో చేర్చడం ప్రధాని మోదీ వల్లే సాధ్యమైంది అని జైశంకర్‌ అన్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని, పాక్‌ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేదాకా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారారయన. 

కాల్పుల విరమణకు పాకిస్థాన్ అడుక్కుంది: జైశంకర్

Videos

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)