Breaking News

విడాకుల పిటిషన్‌: మాజీ సీఎం భార్యకు సుప్రీం నోటీసులు

Published on Mon, 07/15/2024 - 16:57

ఢిల్లీ: జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌లో ఆయన భార్య పాయల్‌ అబ్దుల్లాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో  తన భార్యతో విడాకులను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఓమర్ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టు ఆశ్రయించగా.. జస్టిస్‌ సుధాన్షు ధులియా, జస్టిస్‌ అహ్సానుదిన్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపి ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆయన భార్యకు నోటీసులు జారీ చేసింది.

ఒమర్‌ అబ్దుల్లా ఇప్పటికే 15 ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నారని ఆయన తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టుకు తెలియజేశారు. ఇన్ని ఏళ్లపాటు విడిగా ఉన్న వారి వివాహం బంధం సజీవంగా లేదని కోర్టుకు దృష్టికి తీసుకువెళ్లారు.  ఈ కేసు  ఆర్టికల్‌ 142ను ఉపయోగించి తన క్లైంట్‌ ఒమర్‌ అబ్దుల్లాకు విడాకులు మంజూరు చేయాలని కోర్టును కోరారు.

2016తో తనకు  తన భార్య నుంచి విడాకులు కావాలని ఒమర్‌ అబ్దుల్లా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఆయన చెప్పిన కారణాలు సరైనవి కాదని, నిరూపించాడానికి అవకాశం లేదని విడాకుల పిటిషన్‌ను తిరస్కరిచింది. అనతరం ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ఫ్యామిలీ కోర్టు  ఇచ్చిన తీర్పును సమర్థించటంతో ఒమర్‌ అబ్దుల్లా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు.

ఒమర్‌ అబ్దుల్లా, పాయల్‌  ఢిల్లీలోని ఒబేరాయ్‌లో పని చేస్తున్న సమయంలో తొలిసారి కలిశారు. అనంతరం వారు 1, సెప్టెంబర్‌ 1994న పెళ్లి చేసుకోగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒమర్‌ అబ్దుల్లా  2009 నుంచి విడిగానే ఉంటున్నారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)