Breaking News

ప్రియుడిని న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కి పిల్చి, ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి

Published on Fri, 01/02/2026 - 16:06

పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడిపై దాడిచేసి ప్రైవేట్ భాగాలను నరికివేసింది.తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ వివాహితులే. ముంబైలో ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఎన్‌డీటీవీ కథనం ప్రకారం 25 ఏళ్ల ఒక మహిళ ఇద్దరు పిల్లల తల్లి. ఈమెకు 42 ఏళ్ల వివాహితుడితో దాదాపు ఏడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. భార్యకు విడాకులిచ్చి తనన పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. దీంతో అసలు పెళ్లి ఊసు ఎత్తగానే  సరైన సమాధానం  చెప్పకుండా ముఖం చాటేసేవాడు. తన మాట వినడం లేదని, భార్యను విడిచిపెట్టడానికి నిరాకరించాడన్న కోపంతో  ఆ మహిళ ఇంత దారుణానికి ఒడిగట్టింది.

పెళ్లి చేసుకోవాలన్న ఒత్తిడి తీవ్రమవుతున్న నేపథ్యంలో గత ఏడాది నవంబరులో బిహార్‌కు వెళ్లి పోయాడు. భార్యాబిడ్డలు ముంబైలోని శాంటా క్రజ్‌లోని  ఇంట్లో ఉంటున్నారు. గత 18  ఏళ్లుగా కుటుంబంతో  కలిసి ఇక్కడే ఉంటున్నాడు. బాధితుడు. బిహార్‌కు వెళ్లిన తరువాత కూడా  ఆమె ఫోన్ కాల్స్ ద్వారా పెళ్లి గురించి అడగడం,  అతన్ని బెదిరించడం జరుగుతూనే ఉంది. అయితే  2026 కొత్త సంవత్సరం సందర్బంగా డిసెంబర్ 19న ముంబైకి తిరిగొచ్చాడు. ఇదే అదనుగా భావించిన ప్రేమికురాలు నూతన సంవత్సర వేడుకలకు ఇంటికి రావాల్సిందిగా బాధితుడిని ఆహ్వానించింది. గురువారం తెల్లవారుజామున మాటల్లో పెట్టి, సమయం చూసి పదునైన ఆయుధంతో అతని ప్రైవేట్ భాగాలపై దాడిచేసిందని ముంబై పోలీసు అధికారి తెలిపారు.

ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’

తీవ్ర గాయాలపాలై అధిక రక్తస్రావంతో బాధితుడు మొత్తం మీద బైటపడి, సోదరుడు, ఇతర బంధువుల సాయంతో  బీఎన్‌ దేశాయ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.  గాయం చాలా లోతుగా ఉందని శస్త్రచికిత్స అవసరం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు.  ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరికీ బంధుత్వం ఉన్నట్టు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితురాలి కోసం వెతుకుతున్నారు. 

ఇదీ చదవండి: ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్‌, రికార్డ్‌

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)