విజయ్‌.. ఒక దెబ్బకు రెండు పిట్టలు!

Published on Wed, 07/22/2026 - 11:07

నీట్‌ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న వేళ.. తమిళగ వెట్రి కళగం అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. నీట్‌ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలన్నదే తమ పార్టీ విధానమని ప్రకటించారు. కేవలం పరీక్ష నిర్వహణలో లోపాలు, పేపర్‌ లీక్‌లు వంటి అంశాలను సరిదిద్దితే సరిపోదని.. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష విధానాన్నే పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారాయన. అయితే ఈసారి ఆయన టార్గెట్‌ కేవలం నీట్‌ మాత్రమే కాదని అనిపిస్తోంది.

ఢిల్లీలో నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో టీవీకే కీలక ప్రకటన చేసింది. వైద్య విద్య ప్రవేశాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ప్రస్తుతం విద్య రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా (Concurrent List)లో ఉంది. అంటే కేంద్రం, రాష్ట్రాలు రెండూ దీనిపై చట్టాలు చేయవచ్చు. అయితే విద్యను రాష్ట్ర జాబితా (State List)లోకి మార్చాలని టీవీకే కోరుతోంది.

ఒకవేళ దీనికి రాజ్యాంగపరమైన అడ్డంకులు ఉంటే.. మధ్యంతర పరిష్కారంగా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించే ప్రత్యేక విధానం తీసుకురావాలని సూచించింది. TVK అభిప్రాయం ప్రకారం.. స్థానిక పరిస్థితులు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వైద్య విద్య విధానాలను రాష్ట్రాలే రూపొందించుకునే అవకాశం ఉండాలి.

కేంద్రంపై విమర్శ.. డీఎంకేపై కౌంటర్‌
విజయ్‌ తాజా ప్రకటనలో రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీట్‌ విధానాన్ని వ్యతిరేకించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన టీవీకే.. అదే సమయంలో తమిళనాడులో ప్రధాన ప్రత్యర్థి అయిన డీఎంకేపైనా ప్రశ్నలు సంధించింది.

2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే అధికారంలోకి వస్తే నీట్‌ను రద్దు చేస్తామని(చేయిస్తామని) హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు కాలేదని టీవీకే విమర్శించింది.

“మేమే నీట్‌ను రద్దు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేయం” అంటూ పరోక్షంగా డీఎంకేను టార్గెట్‌ చేసింది టీవీకే. ఒకే అంశంతో అటు కేంద్ర విధానాన్ని వ్యతిరేకిస్తూ.. ఇటు డీఎంకే హామీలను ప్రశ్నించే వ్యూహాన్ని విజయ్‌ అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పాత వివాదమే.. కొత్త రాజకీయ రంగు
తమిళనాడులో ఈ అంశం కొత్తది కాదు. వైద్య విద్య ప్రవేశాల్లో జాతీయ స్థాయి పరీక్ష అవసరమా? లేదంటే రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలా? అనే చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. నీట్‌ను వ్యతిరేకించేవాళ్లు.. గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విధానం ప్రతికూలంగా మారుతోందని వాదిస్తున్నారు. కోచింగ్‌ వ్యవస్థకు ప్రాధాన్యం పెరిగి, సామాన్య కుటుంబాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. మరోవైపు అనుకూల వర్గాలు మాత్రం దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల్లో ఒకే ప్రమాణం ఉండేందుకు జాతీయ స్థాయి పరీక్ష అవసరమని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పేపర్‌ లీకేజీ వివాదం.. తమిళనాడు చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది.

విజయ్‌కు రాజకీయంగా కీలకమా?
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌.. టీవీకేను బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. యువత, విద్యార్థులు, రాష్ట్ర హక్కులు వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుంటున్నారు. తమిళనాడులో విద్య, సామాజిక న్యాయం అంశాలు ఎప్పటి నుంచో కీలక రాజకీయ అంశాలు. ఈ నేపథ్యంలో నీట్‌ వ్యతిరేకతను బలంగా వినిపించడం ద్వారా విద్యార్థుల్లో, యువ ఓటర్లలో తన పార్టీకి స్థానం పెంచుకునే ప్రయత్నంగా ఈ అడుగును చూస్తున్నారు.

NEET రగడ.. పొలిటికల్‌ గేమ్‌గా మారుతుందా?
ఇప్పటివరకు నీట్‌ వివాదం ప్రధానంగా పరీక్షా విధానం, లీక్‌లు, సంస్కరణల చుట్టూ తిరిగింది. కానీ తమిళనాడులో మాత్రం ఇది కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాజకీయ ఆధిపత్య పోరుగా మారే అవకాశం కనిపిస్తోంది. విజయ్‌ తాజా వైఖరి చూస్తే.. నీట్‌ అంశాన్ని కేవలం విద్యా సమస్యగా కాకుండా రాజకీయ చర్చగా మార్చే ప్రయత్నం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. NEET వ్యతిరేకతతో కేంద్రంపై విమర్శలు, డీఎంకేపై ఎదురుదాడి.. రెండింటినీ ఒకేసారి సాధించే వ్యూహంతో విజయ్‌ ముందుకు సాగుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)