150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్‌ మంతర్‌లో మానవత్వపు పరిమళాలు

Published on Fri, 07/24/2026 - 15:46

న్యూఢిల్లీ: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థుల కోసం నాగాలాండ్‌కు చెందిన ఒక వ్యక్తి చేసిన వినూత్నసహాయం సోషల్ మీడియాలో పలువురి హృదయాలను గెలుచుకుంది.  ఏకంగా 150 పిజాలు ఆర్డర్‌ చేసి, ఆకలిగా ఉన్నవారికి ఇవ్వండి అంటూ మానవత్వాన్ని చాటుకున్న వైనం విశేషంగా నిలుస్తోంది.

నాగాలాండ్‌కు చెందిన 'ఝా-లౌ' (Zha-Lhou) అనే వ్యక్తి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊరి నుంచే డొమినోస్ యాప్ ద్వారా 150 "చీజ్ బర్స్ట్" (Cheese Burst) పిజాలను ఆర్డర్ చేసి నేరుగా జంతర్ మంతర్‌కే డెలివరీ చేయించారు. జులై 22న కొరియన్ స్వీట్ చిల్లీ, ఫార్మ్‌హౌస్ రకాలకు చెందిన పిజాలకు మొత్తం బిల్లు రూ. 67,734.18 అయింది. మరో రూ. 5,000 విలువైన బిస్కెట్లను కూడా ఆర్డర్ చేశారు.

పిజాలు డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్ ఈ ఆర్డర్ ఎవరికి ఇవ్వాలి? అని ఫోన్ చేసి అడగ్గా, అక్కడ ఇంకా ఆహారం తినకుండా ఆకలితో ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే, వారికి ఇచ్చేయండి అని ఝా-లౌ చెప్పారు.

అంతేకాదు ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్‌ మీడియాలో ప్రకటించడం వైరల్‌గా మారింది. "నేను నాగాలాండ్‌లో ఉన్నాను, వేలాది మంది విద్యార్థులు మంచి భవిష్యత్తు, న్యాయమైన విద్యా వ్యవస్థ కోసం జంతర్ మంతర్ వద్ద పోరాడుతున్నారు. ప్రత్యక్షంగా అక్కడ ఉండలేకపోయాను, కాబట్టి నా వంతుగా నేను చేయగలిగిన చిన్న సహాయం ఇది" అని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ (@adiespoems) ఖాతాలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్‌ గాంధీ

అంతేకాకుండా, ప్రశంసల కోసం తాను ఈ పోస్ట్ పెట్టలేదని, ఇతరులకు కూడా తమకు తోచిన రీతిలో సహాయం చేసేందుకు ప్రేరణగా ఉంటుందని మాత్రమే షేర్ చేశానని తెలిపారు. ఆ తర్వాత విద్యార్థుల కోసం మరో రూ. 5,000 విలువైన బిస్కెట్లను కూడా ఆర్డర్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: ఐఫోన్‌ రాలేదు, ఆయిల్‌ వచ్చింది.. కట్‌ చేస్తే రూ. 1.81 లక్ష

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)