Breaking News

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ముస్కాన్ రస్తోగి

Published on Wed, 11/26/2025 - 08:12

బ్లూ డ్రమ్‌.. ఈ పేరు వింటేనే భర్తల వెన్నులో వణకు పుడుతోంది. అందుకు కారణం.. మీరట్‌లో జరిగిన ఓ ఘటన. ప్రాణానికి ప్రాణంగా  ప్రేమించిన భర్తను ప్రియుడి సాయంతో గంజాయి మత్తులో కిరాకతంగా హతమార్చింది ఓ భార్య. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కూడా. అయితే.. 

భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ (మర్చంట్ నేవీ ఆఫీసర్)ను అత్యంత కిరాతకంగా కడతేర్చిన ముస్కాన్ రస్తోగి మళ్లీ తల్లైంది. ఆదివారం సాయంత్రం మీరట్‌ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సయమంలో ముస్కాన్‌ ప్రియుడు, ఈ కేసు సహ నిందితుడు సాహిల్ శుక్లా కూడా పక్కనే ఉన్నాడు. ఒకవేళ ఆ బిడ్డ తమ కొడుకుకే పుట్టినట్లు డీఎన్‌ఏ పరీక్షల్లో తేలితే.. తమ మనవడిగా స్వీకరిస్తామని సౌరబ్‌ కుటుంబం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

మీరట్‌లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బ్లూ డ్రమ్ హత్యకేసు మరోసారి వార్తల్లో నిలిచింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను క్రూరంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా అరెస్టైన ముస్కాన్ రస్తోగి, ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న ఆమె.. ఆదివారం సాయంత్రం జైలు అధికారుల పర్యవేక్షణలో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో  పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ప్రియుడు సాహిల్‌ శుక్లా మోజులో పడి భర్త సౌరభ్‌ గుప్తను హత్య చేయించిన కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ముస్కాన్ రస్తోగి అరెస్టు సమయంలోనే ఆమె గర్భవతిగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమెకు ప్రత్యేక వైద్య పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. గర్భధారణ చివరి దశకు చేరుకోవడంతో, భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమెను మీరట్ మెడికల్ కాలేజీకి తరలించారు.

ముస్కాన్ సాధారణ ప్రసవం ద్వారా ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రసవం అనంతరం, భద్రతా కారణాల వల్ల వారిని ప్రత్యేక వార్డులో ఉంచారు. ఈ కేసు 2024లో వెలుగులోకి వచ్చింది.సౌరభ్ రాజ్‌పుత్ హత్య అనంతరం, అతని శవాన్ని బ్లూ డ్రమ్‌లో నింపి మాయం చేసిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు విచారణలో ముస్కాన్ రస్తోగి, ఆమె స్నేహితుడు సహా పలువురిని అరెస్టు చేశారు. 

శిశువు భవిష్యత్తుపై చర్చ 
ముస్కాన్ జైలులో శిశువుకు జన్మనివ్వడంతో, బిడ్డను ఎక్కడ ఉంచాలి? ఎవరు చూసుకుంటారు? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చట్టం ప్రకారం, మహిళా ఖైదీలు తమ పిల్లలను ఆరు సంవత్సరాల వయస్సు వరకు జైలులోనే ఉంచుకునే అవకాశం ఉంది.  

ముస్కాన్ రస్తోగిపై హత్య, శవాన్ని మాయం చేయడం, కుట్ర వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ప్రసవం అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించే ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)