Breaking News

లక్షల్లో సంపాదన.. ఇస్మార్ట్‌ ఆటోవాలాకు బిగ్‌ షాక్‌

Published on Thu, 06/12/2025 - 16:19

ఆటో నడపకుండానే.. కత్తిలాంటి ఐడియాతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడంటూ ఓ ఆటోవాలా గురించి సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. నిజనిర్ధారణలోనూ.. అది వాస్తవమేనని తెలిసేసరికి వహ్‌ అనుకున్నారంతా. ప్రముఖులు సైతం బ్రిలియంట్‌ అంటూ మెచ్చుకున్నారు. అయితే ఆ ప్రచారమే ఇప్పుడు అతని పాలిట శాపంగా మారింది. 

లింక్డిన్‌లో వెన్యూమోంక్‌ కో ఫౌండర్‌ రాహుల్‌ రుపానీ ఆ ఆటోడ్రైవర్‌ కథనాన్ని షేర్‌ చేశారు. బంద్రాకుర్లా కాంప్లెక్స్‌లోని యూఎస్‌ కన్సులేట్‌ బయట ఆటోను పార్క్‌ చేసి.. వచ్చిపోయే సందర్శకుల  సామాన్లను క్లాక్‌ రూమ్‌ తరహాలో ఆటోలో భద్రపరిచి సంపాదన చేస్తున్నాడతను. అలా ఒక్కో కస్టమర్‌ దగ్గరి నుంచి రూ.1000 చొప్పున.. నెలకు రూ.ఐదు లక్షల నుంచి 8 లక్షల దాకా సంపాదిస్తున్నాడంటూ ఆయన స్టోరీ షేర్‌ చేశారు. హర్ష్‌ గోయెంకాలాంటి ప్రముఖులు సైతం ఆ ఆటోవాలా బుర్రకు ఫిదా అయిపోయారు.

అయితే అతని కథనాలకు ముంబై పోలీసులు స్పందించారు. ఆ ఆటో డ్రైవర్‌ లాగే మరో 12 మంది అక్కడే అదే పనిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. తక్షణమే ఆ జాగా ఖాళీ చేయాలంటూ  అందరికీ సమన్లు జారీ చేశారు. ‘‘యూఎస్‌ కన్సులేట్‌ బయట భద్రతా కారణాల దృష్ట్యా పార్కింగ్‌ నిషేధిస్తున్నాం. ఆటో డ్రైవర్లు కేవలం ప్యాసింజర్లను అక్కడ దించి వెళ్లిపోవాలే తప్ప ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు.  

అయితే ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో ముంబై పోలీసులు మళ్లీ స్పందించారు. ‘‘ఆ ఆటో డ్రైవర్‌కు లైసెన్స్‌ ఇచ్చింది ఆటో నడుపుకోవడానికి. అంతేగానీ లాకర్‌ సేవలు అందించడానికి కాదు. అతను మాత్రమే కాదు.. అతనిలా మరికొందరు డ్రైవర్లు అదే పనిలో ఉన్నారని మా విచారణలో తేలింది. కేవలం డ్రైవర్లకు మాత్రమే కాదు.. సమీపంలోని దుకాణాదారులకు కూడా లాకర్‌ సర్వీసులు నడిపించేందుకు అనుమతులు లేవు. ఒకవేళ ఎవరైనా అలా నడిపిస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని ముంబై పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. పాపం.. బ్రిలియంట్‌ ఐడియాతో వైట్‌ కాలర్‌ జీతగాళ్లకు కూడా దక్కని సంపాదనతో బిజినెస్‌ చేస్తున్నాడని పొగిడేలోపే ఆ ఆటో డ్రైవర్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)