Breaking News

ముంబై బీఎండ‌బ్ల్యూ ఘ‌ట‌న‌.. మిహిర్‌ షాకు పోలీస్ క‌స్ట‌డీ

Published on Wed, 07/10/2024 - 16:51

ముంబై:  ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను జూలై 16 వరకు  పోలీసు కస్టడీ విధించింది కోర్టు. దీంతో నేటి నుంచి ఏడు రోజుల‌పాటు మిహిర్ షాను ముంబై పోలీసులు విచారించ‌నున్నారు. ప్ర‌మాదానికి సంబంధించిన విష‌యాల‌ను నిందితుడి నుంచి రాబ‌ట్ట‌నున్నారు. అయితే మిహిర్ మొబైల్ ఇంకా రిక‌వ‌రీ కాలేద‌ని పోలీసులు తెలిపారు.

కాగా జులై 7న (ఆదివారం తెల్ల‌వారుజామున‌) మ‌ద్యం మ‌త్తులో మిహిర్ షా బీఎండ‌బ్ల్యూ కారుతో ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొట్ట‌డంతో 45 ఏళ్ల మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆమె భ‌ర్త గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. అయితే ప్ర‌మాదం జ‌రిగిన‌ప్ప‌టి నుంచి మిహిర్ షా ప‌రారీలో ఉన్నాడు. దాదాపు 72 గంట‌ల తర్వాత నిందితుడిని విహార్‌లో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

మ‌రోవైపు నిందితుడు తండ్రి, శివసేన నాయకుడు రాజేష్ షాను పార్టీ స‌స్పెండ్ చేసింది. ఇక ప్ర‌మాదం త‌ర్వాత మిహిర్ త‌న ప్రియురాలికి 40 సార్లు ఫోన్ చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. మ‌హిళ‌ను కారుతో గుద్ది చంపిన త‌ర్వాత కారును విడిచిపెట్టి ఆటో ఎక్కి ఆమె ఇంటికి వెళ్లిన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ప్రియురాలిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవచ్చని పేర్కొన్నారు.
చ‌ద‌వండి: ముంబై బీఎండబ్ల్యూ ఘటన... నిందితుడి తండ్రిపై శివసేన చర్యలు

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)