కూతురి బర్త్‌డేకి... తల్లి సర్‌ప్రైజ్‌

Published on Sat, 01/17/2026 - 16:28

బర్త్‌డే అంటే వయసుతో నిమిత్తం లేకుండా అందరమూ చిన్నపిల్లలైపోతాం. చిన్న వయసులో బర్త్‌డే అంటే ఎదుగుతున్నామన్న సంతోషం అటు తల్లిదండ్రుల్లోనూ, ఇటు పిల్లల్లోనూ ఉండటం సహజం. ఒక సంవత్సరం వయసు పెరుగుతోందన్న బెంగ లేకుండా పెద్దలు కూడా ఈ పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం. అంత స్పెషల్‌ పుట్టిన రోజు. ఈ వేడుకల్లో ఇష్టమైన బట్టలు, ప్రదేశాలు, కోరికలు ఇలా చిట్టా చాలానే  ఉంటాయి.  కానీ మనకిష్టమైన వాళ్లు, మనకిష్టమైన వంటకాలను అదీ ఇంట్లో వండితే బాగా గుర్తుండిపోతాయి. దీన్నేకంటెంట్ క్రియేటర్ బర్త్‌డేని    ఆమె తల్లి ఫుడీగా నిర్వహించింది. అదేంటో చూద్దాం.

కంటెంట్ క్రియేటర్ సారా సరోష్ 27వ పుట్టినరోజును  ఆమె కుటుంబంగా వినూత్నంగా జరుపుకుంది. ఆమె 27 ఏళ్లను గుర్తు చేసుకుంటూ ఆమె తల్లి ఒకటీ రెండు కాదు, ఏకంగా 27 రకాల వంటకాలను తయారు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో  వైరల్‌గా మారింది.  ఈ క్లిప్ పుట్టినరోజు అమ్మాయి తన ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది, ఈ రూమ్‌ అంతా అద్భుతమైన అలంకరణలతోపాటు, టేబుల్‌పై అమర్చిన పదార్థాలు చూసి ఆశ్చర్యపోవడం బర్త్‌డే గార్ల్‌ వంతైంది.

అలాగే కుటుంబ సభ్యులందరూ రకరకాల ఆహార పదార్థాలు టేబుల్‌పై అమర్చడానికి ముందు వాటిని తయారు చేయడం, చివరి నిమిషంలో కొన్ని వంటకాలను, తల్లి తయారు చేస్తున్న దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. వావ్‌.. 27 ఏళ్లకు 27 వంటకాలు, నా బర్త్‌డేకి బెస్ట్‌ గిఫ్ట్‌ థ్యాంక్యూ అమ్మా...ఎప్పటికీ నువ్వే మా అమ్మ అంటూ సారా తన సంతోషాన్ని వెలిబుచ్చింది. 

 ఈ విందులో వివిధ రకాల ఫ్రైడ్ చికెన్ ముక్కలు, వింగ్స్, చిన్న సమోసాలు, పినా కోలాడా,రస్నా గ్లాసులు ఉన్నాయి. సలాడ్‌లు, పాస్తాలు, ఇతర డిషెస్‌ ఉన్నాయి.  టేబుల్ మధ్యలో ఫ్రాస్టింగ్‌తో కూడిన గుండ్రని చాక్లెట్ కేక్ ఉంది, దాని పక్కనే ప్రాన్ సుషీ, ప్రాన్ ఫ్రై, దహీ కే కబాబ్, స్టఫ్డ్ పొటాటోస్, తందూరి ప్రాన్స్ , చికెన్ షెజ్వాన్ వంటి వంటకాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: 26..26 : ప్రేమకు కొత్త అర్థం చెప్పిన ప్రియుడు, వైరల్‌ వీడియో

దీనిపై నెటిజన్లు కూడా తమ ఆనందాన్ని ప్రకటించారు. ఇంత అద్భుతమైన తల్లిదండ్రులున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతు రాలివి అంటూ సారాను దీవించారు. తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటుంది. ఈ వంటకాల గురించి తెలుసుకోవాలని ఉంది అని ఒకరు, ఇది ఏఐ పిక్‌లా ఉంది అని మరొకరు చమత్కరించారు.  

ఇదీ చదవండి: గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్‌

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)