Breaking News

పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్‌,షాకింగ్‌ వీడియో

Published on Fri, 02/27/2026 - 16:15

ప్రస్తుత సమాజంలో భార్యను భర్త, భర్తను భార్య నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం పరిపాటిగా మారిపోయింది. స్వల్ప విషయాలకు , చట్టపరంగా తేల్చుకోవాల్సిన విషయాలకు మనుషుల ఉసురు తీయడం సునాయాసంగా జరిగిపోతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అలాంటి దారుణం ఒకటి వెలుగు చేసింది.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పట్టపగలే, నలుగురూ చూస్తుండగానే అతిదారుణంగా ఒక వ్యక్తి తన భార్య ప్రియుడిని కాల్చి చంపేశాడు. బుధవారం మధ్యాహ్నం మీరట్-ముజఫర్‌నగర్ జిల్లా సరిహద్దు సమీపంలో ఉన్న సందడిగా ఉండే మార్కెట్‌లో చోటుచేసుకుంది. బాధితుడిని 28 ఏళ్ల సురేంద్ర (సునీల్)గా గుర్తించారు.

 ఈ దారుణానికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాంరాజ్‌లోని జగ్జీవన్ పురి ప్రాంతంలో నివసిస్తున్న సురేంద్ర తన మోటార్‌సైకిల్‌పై మార్కెట్ గుండా వెళుతుండగా దాడి జరిగింది వెనుక నుండి వచ్చిన ప్రదీప్‌, నడుము దిగువ భాగంలో తొలికాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడిపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపాడు. అడ్డు వచ్చిన వారిపై కూడా బెదిరింపులకు పాల్పడటం తీవ్ర దిగ్బ్రాంతి రేపింది. దీంతో తీవ్ర భయాందోళనలతో దుకాణదారులు , విక్రేతలు మార్కెట్ నుంచి పారిపోయారు .

ఇదీ చదవండి:  ViRosh అచ్చమైన దేవతలా ఆమె, ఆభరణాలతో కొత్త ట్రెండ్‌

పాత పగలే దీనికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుమారు 18 నెలల క్రితం, ప్రదీప్ భార్య పూనం ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలేసి సురేంద్రతో పారిపోయింది.అప్పటినుంచీ కలిసే ఉంటున్న వీరు కోర్టు ద్వారా వారి సంబంధాన్ని అధికారికం చేసుకోవాలని యోచిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో ప్రదీప్‌, సుధీర్‌ గతంలో బహిరంగ ఘర్షణకు దిగారు. దీంతో ఆ‍గ్రహం పెంచుకున్న ప్రదీప్‌ ఈ హత్యకి పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?

కాల్పుల తర్వాత, ప్రదీప్ నాలుగు నిమిషాల వీడియోను రికార్డ్ చేశాడు. ఈ హత్యకు తానే బాధ్యుడునని ఒప్పుకున్నాడు. నెక్ట్స్‌ టార్గెట్‌ నువ్వే అంటూ మాజీ భార్యకు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు.  అంతేకాదు 18 నెలలనుంచి తన మాటను పోలీసులు పట్టించుకోలేంటూ ఈ వీడియోను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP)తో పంచుకోవాలని కోరాడు. మరో వైరల్ వీడియోలో నిందితుడి చుట్టూ అధికారులుండగానే ఎలాంటి పశ్చాత్తాపం లేని ప్రదీప్, ప్రశాంతంగా బీడీ వెలిగించి పొగ త్రాగుతున్నట్లు కనిపించాడు.

బాధితుడి కుటుంబం ఫిర్యాదు ఆధారంగా, నిందితుడు ప్రదీప్‌ను అరెస్ట్‌ చేసి, కేసు నమోదు చేశారు. ఎలాంటి ఘర్షణలు చెలరేగ కుండా ముందస్తు జాగ్రత్తగా అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)